Breaking News

స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లూ.. వీళ్లతో జాగ్రత్త!

Published on Thu, 03/13/2025 - 19:06

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై గ్యారంటీ రాబడిని అందిస్తామంటూ కొంతమంది వ్యక్తులు ఇన్వెస్టర్లను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సాక్ట్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ (NSE నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌) తెలిపింది. కొన్ని సంస్థల పేరుతో మదుపర్లను బురిడీ కొట్టించి వారి నుంచి ట్రేడింగ్‌ అకౌంట్‌ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి వివరాలను తీసుకుంటున్నారని, ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది.

మోసగాళ్లు.. వారి ఫోన్‌నంబర్లు ఇవే..
ఇటీవల తమ దృష్టికి వచ్చిన కొంత మంది మోసపూరిత వ్యక్తులు.. వారి ఫోన్‌ నంబర్లు, వారు పేర్కొన్న సంస్థల వివరాలను ఎస్‌ఎస్‌ఈ వెల్లడించింది.

  • “టీజీ లెవెల్” (TG Level) అనే సంస్థ పేరుతో మొబైల్ నంబర్ 8420583592 ద్వారా మోసగిస్తున్నారు.

  • “వీవీఎల్‌” (VVL) అనే సంస్థ పేరుతో జైరామ్ భట్ బోధిస్తారని లీలా తలస్సా అనే వ్యక్తి
    9662890247 నంబర్‌ ద్వారా మోసగిస్తున్నారు.

  • సుజల్ పటేల్, నవదీప్ బజ్వా అనే వ్యక్తులు “డ్యామ్‌ ట్రేడ్ క్యాపిటల్” (DAM Trade Capital) అనే సంస్థతో అనుబంధం ఉన్నట్లు 7054874084, 9967603975 నంబర్ల ద్వారా మోసగిస్తున్నారు.

  • “సుప్రీమస్ ఏంజెల్” (Supremus Angel) అనే సంస్థకు సంబంధించిన వాళ్లమంటూ జిగ్నేష్ , “ఎక్స్‌నెస్ బ్రోకర్” (Exnes Broker) అనే సంస్థ చెందిన వ్యక్తలమంటూ తేజస్ పటేల్, జగదీష్ అనే వ్యక్తులు 8780321223,  9375033033 నంబర్ల ద్వారా ఇన్వెస్టర్లను సంప్రదిస్తున్నారు.

పైన పేర్కొన్న వ్యక్తులు, సంస్థలు, మొబైల్‌ నంబర్ల నుంచి ఫోన్‌ చేసి స్టాక్ మార్కెట్లో ఖచ్చితమైన రాబడులు అందిస్తామని వాగ్దానం చేసి తమ ఇన్వెస్ట్‌మెంట్‌ పథకాలకు సభ్యత్వాన్ని పొందాలని కోరితే స్పందించవద్దని ఎన్‌ఎస్‌ఈ సూచించింది. ఇటువంటి వాగ్దానాలు చేయటం చట్ట ప్రకారం నిషేధమని స్టాక్‌ ఎక్స్ఛేంజీ స్పష్టం చేసింది. తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్ వంటి ట్రేడింగ్ ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. ఇలా ఎవరైనా వ్యక్తులు, సంస్థలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రిజిస్టర్డ్ మెంబర్‌గా పేర్కొంటే తమ వెబ్‌సైట్‌లో https://www.nseindia.com/invest/find-a-stock-broker లింక్‌ ద్వారా  ధ్రువీకరించుకోవచ్చని తెలిపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)