Breaking News

డాలర్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

Published on Tue, 06/23/2026 - 11:14

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుల నుంచి డాలర్లను ఆకర్షించే దిశగా కొత్త ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బి) డిపాజిట్లపై బ్యాంకులకు ఆర్‌బీఐ డాలర్‌–రూపీ ఫారెక్స్‌ స్వాప్‌ సదుపాయాన్ని ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకులు సదరు ఖాతాలపై రేట్లను సవరించాయి. ఈ డిపాజిట్లపై బంధన్‌ బ్యాంక్‌ ఆకర్షణీయ వడ్డీ రేట్లను ప్రకటించింది. 3 నుంచి 5 ఏళ్ల వ్యవధికి 1 మిలియన్‌ డాలర్లకు పైగా డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీ రేటు ఉంటుందని బ్యాంకు తెలిపింది. 1 మిలియన్‌ డాలర్ల వరకు డిపాజిట్లపై 7 శాతం ఉంటుందని పేర్కొంది. రూపాయి క్షీణతపరమైన రిసు్కలను అధిగమించి మెరుగైన రాబడులను అందుకునేలా ఎన్‌ఆర్‌ఐ కస్టమర్లకు ఇది సహాయకరంగా ఉంటుందని బ్యాంక్‌ ఈడీ రాజీందర్‌ కుమార్‌ బబ్బర్‌ తెలిపారు.

మరోవైపు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా .. తమ లెజెండ్‌ ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బి) డిపాజిట్‌ స్కీము కింద డాలర్‌ డిపాజిట్లపై 6.25 శాతం వరకు, బ్రిటీష్‌ పౌండ్‌ స్టెర్లింగ్‌ .. ఆస్ట్రేలియన్‌ డాలర్‌పై 4.75 శాతం, యూరో డిపాజిట్లపై 3.75 శాతం, కెనడియన్‌ డాలర్‌ డిపాజిట్లపై 5.15 శాతం వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇవి మూడు నుంచి ఐదేళ్ల కాలవ్యవధికి వర్తిస్తాయి. అటు ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కూడా ఈ డిపాజిట్లపై వడ్డీ రేటును 7.13 శాతం వరకు పెంచినట్లు తెలిపింది. ఇక సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బి) డిపాజిట్లపై 6.50 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది.

సాధారణంగా ఈ విధానంలో ప్రవాస భారతీయులు డాలర్ల మారకంలో ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బి) ఖాతాలో డిపాజిట్‌ చేస్తారు. ఆ డాలర్లను సదరు బ్యాంకు నిర్దిష్ట రిఫరెన్స్‌ రేటుకు ఆర్‌బీఐకి విక్రయించి, రూపాయి మారకంలో నిధులు సమకూర్చుకుంటుంది. మెచ్యూరిటీ సమయంలో మళ్లీ అదే రేటుకి ఆర్‌బీఐ నుంచి డాలర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలో రూపాయి బలహీనపడితే బ్యాంకు నష్టపోకుండా ఆర్‌బీఐ ఆ రిసు్కను భరిస్తుంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)