Breaking News

వాట్సాప్‌లో ఆధార్ డౌన్‌లోడ్‌: ఇంత సింపులా..

Published on Sun, 01/04/2026 - 21:06

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు చాలా అవసరం. ఇది కేవలం మనకు గుర్తింపుగా మాత్రమే కాకుండా.. అనేక వ్యవహారాల్లో ఉపయోగపడుతుంది. అయితే దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. కొన్నిసార్లు ఆధార్ సెంటర్లకు లేదా ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ప్రక్రియను మరింత సులభతరం చేసి.. వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

ఇదివరకు యూఐడీఏఐ పోర్టల్ లేదా డిజిలాకర్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్లు సాధ్యమయ్యేవి. తాజా ఫీచర్‌తో వాట్సాప్‌లోనే ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే.. ఈ సేవను ఉపయోగించడానికి, కార్డుదారులు తమ ఆధార్‌తో లింక్ చేసిన డిజిలాకర్ ఖాతాను కలిగి ఉండాలి. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. మైగవ్ హెల్ప్‌డెస్క్ +91-9013151515 నంబర్ ద్వారా పనిచేస్తుంది.

వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్
➤ముందుగా మీ మొబైల్‌లో మైగవ్ హెల్ప్ డెస్క్ నెంబరు +91-9013151515 ను సేవ్ చేయండి
➤నెంబర్ సేవ్ చేసుకున్న తరువాత.. వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు "హాయ్" లేదా "నమస్తే" వంటి మెసేజ్‌ పంపండి.
➤చాట్‌బాట్ అందించే ఎంపికల నుంచి డిజిలాకర్ సేవలను ఎంచుకోండి
➤మీ డిజిలాకర్ ఖాతాను వెరిఫై చేసి.. మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయండి.
➤వెరిఫికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు పంపిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
➤వెరిఫికేషన్‌ పూర్తియన తర్వాత, చాట్‌బాట్ అందుబాటులో ఉన్న పత్రాల జాబితాను ప్రదర్శిస్తుంది.
➤అందులో నుంచి ఆధార్ కార్డును ఎంచుకుంటే.. అది పీడీఎఫ్ ఫార్మాట్‌లో వాట్సాప్‌లో కనిపిస్తుంది.

యూజర్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒకేసారి ఒక పత్రాన్ని మాత్రమే పొందవచ్చు. ఆధార్ ఇప్పటికే డిజిలాకర్‌లో లింక్ చేసి ఉండాలి. లింక్ చేయకపోతే వాట్సాప్ ఎంపికను ఉపయోగించే ముందు డిజిలాకర్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా వివరాలను అప్డేట్ చేయాలి.

ఇదీ చదవండి: 70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ!

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)