Breaking News

ఇంకా మించి పోలేదు: వెండి ధరలపై కియోసాకి

Published on Tue, 01/13/2026 - 00:54

బంగారం, వెండి లోహాలపై ఎప్పుడూ బుల్లిష్‌గా ఉండే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ( Rich Dad Poor Dad ) రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి వెండిపై బలమైన ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో స్పందిస్తూ.. ‘యేయ్‌.. వెండి 80 డాలర్లు దాటిందోచ్‌’ అంటూ ధరల పెరుగుదల ఇంకా ముగిసిపోలేదని స్పష్టం చేశారు.

ఇటీవల వెండి ధరలు ఔన్సుకు 80 డాలర్లు దాటడంతో ఈ ర్యాలీ ఇక్కడితో ఆగిపోతుందా అనే పెట్టుబడిదారుల సందేహాలకు కియోసాకి (Robert Kiyosaki ) సమాధానమిచ్చారు. ‘వెండి కొనడానికి ఇ‍ప్పటికే ఆలస్యమైందా?​‍’ అనే ప్రశ్నకు ఆయన స్పష్టంగా  “లేదు” అని చెప్పారు. ధరలు 100 డాలర్ల స్థాయికి (ఔన్స్‌కు) చేరుకునే వరకు వెండిని కొనుగోలు చేస్తూనే ఉంటానని, ఆ తర్వాత పరిస్థితిని పరిశీలిస్తానని తెలిపారు.

కఠిన ఆస్తులు (హార్డ్ అసెట్స్), ఫియాట్ కరెన్సీ విలువ క్షీణత, ద్రవ్యోల్బణ ప్రమాదాలపై తరచూ హెచ్చరికలు చేసే కియోసాకి.. పెట్టుబడిలో క్రమశిక్షణ అవసరాన్ని గుర్తు చేస్తూ “పందులే బలుస్తాయి. మాంసం కోసం వాటినే వధిస్తారు” అనే ప్రసిద్ధ నానుడిని ప్రస్తావించారు. అంటే, దురాశతో కాకుండా నియంత్రిత రిస్క్‌తో లాభాలు సాధించాలన్న సందేశాన్ని ఆయన ఇచ్చారు.

ఈ వ్యాఖ్యలు ఆయన గత అంచనాలకు కొనసాగింపుగానే వచ్చాయి. 2025 చివర్లో వెండి ఔన్సుకు 72 డాలర్లు దాటినప్పుడు, దానిని “బంగారం, వెండి పోగు చేసేవారికి గొప్ప వార్త”గా అభివర్ణించిన కియోసాకి, అదే సమయంలో డబ్బును పొదుపుపైనే ఆధారపడే పెట్టుబడిదారులకు ఇది “చెడు వార్త” అని హెచ్చరించారు.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, 2026 నాటికి వెండి ధర ఔన్సుకు 200 డాలర్లు చేరవచ్చని ఆయన అంచనా వేశారు. పారిశ్రామిక డిమాండ్, సేఫ్-హేవెన్ పెట్టుబడులు, అలాగే గ్లోబల్ ఆర్థిక అస్థిరత కలయికే వెండి ధరలను పైకి నడిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Videos

కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి

వర్మకు పవన్ అవమానం.. రగిలిపోతున్న పిఠాపురం

YSRCP మొసలి కన్నీరు కరుస్తుందా.. అదిరిపోయే కౌంటర్ కుమార్ యాదవ్

అల్లు అర్జున్ మూవీ లైనప్..

ప్రభాస్ గురించి తెలియని నిజాలు..! సోషల్ మీడియా షేక్ అవుతుందిగా

మన శంకరవరప్రసాద్ తర్వాత, ఏ హీరోతో అనిల్ రావిపూడి చిత్రం చేస్తాడు?

బాబుకు బిగ్ షాక్ హైకోర్టుకు స్కిల్ స్కామ్ కేస్?

Garam Garam Varthalu: కలెక్షన్ కింగ్

Garam Garam Varthalu: కొడుకు మీద ప్రేమతో

KSR: రాజ్యసభ సీటు కోసం బేరసారాలా?

Photos

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)