Breaking News

ఐపీవోలో సెక్యూరిటీ డిపాజిట్‌ రద్దు

Published on Sun, 11/24/2024 - 12:01

న్యూఢిల్లీ: ఏదైనా కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకి వచ్చేముందు స్టాక్‌ ఎక్స్చేంజీల వద్ద తప్పనిసరిగా డిపాజిట్‌ చేయవలసిన నిబంధనలను తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. ఐపీవో చేపట్టే ప్రణాళికలుగల అన్‌లిస్డెడ్‌ కంపెనీలకు  సెక్యూరిటీ డిపాజిట్‌పై వెసులుబాటు కల్పిస్తూ సెబీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది.

దీంతో ఇకపై ఇష్యూ పరిమాణంలో 1 శాతాన్ని స్టాక్‌ ఎక్స్చేంజీల వద్ద డిపాజిట్‌ చేయవలసిన అవసరం ఉండదు. సులభతర బిజినెస్‌ నిర్వహణకు వీలు కల్పించే బాటలో సెబీ వెనువెంటనే అమల్లోకి వచ్చేవిధంగా సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇప్పటివరకూ పబ్లిక్‌ ఇష్యూ ముగిశాక సెక్యూరిటీ డిపాజిట్‌ను స్టాక్‌ ఎక్స్చేంజీలు తిరిగి చెల్లిస్తున్నాయి.

ఐపీవో లేదా రైట్స్‌కు ముందు 1 శాతం మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌ చేసే నిబంధన రద్దుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సెబీ చర్చాపత్రానికి తెరతీసింది. ప్రస్తుతం ఐపీవో ప్రక్రియలో ఇన్వెస్టర్ల ఖాతా లకు అస్బా అమలుకావడం, యూపీఐ చెల్లింపులు, డీమ్యాట్‌ ఖాతాల్లోకి షేర్ల అలాట్‌మెంట్‌ అమలు జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ డిపాజిట్‌ అవసరానికి కాలం చెల్లినట్లు సెబీ వివరించింది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)