Breaking News

భారత్‌ అభివృద్ధిని ఏ శక్తీ నిలువరించలేదు 

Published on Thu, 10/09/2025 - 06:33

ముంబై: భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, భూమిపై ఏ శక్తి దీన్ని అడ్డుకోలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. దేశీ ఆరి్థక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఎన్నో చర్యలను ప్రభు త్వం తీసుకుందన్నారు. మౌలిక వసతుల కల్పనతోపాటు అంతర్జాతీయ వాణిజ్య విస్తరణకు చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ (జీఎఫ్‌ఎఫ్‌) 6వ ఎడిషన్‌ను ఉద్దేశించి మంత్రి గోయల్‌ మాట్లాడారు.

 ‘‘నేడు ప్రపంచం భారత్‌ను విశ్వసిస్తోంది. అత్యున్నత నాణ్యమైన నిపుణులు, వస్తు, సేవలకు భారత్‌ హామీ ఇస్తోంది. 100 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. టెక్నాలజీతో కలసి సాగకుంటే ఇది సాధ్యం కాదు. 2047 నాటికి 30–35 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారత్‌ ఆకాంక్షిస్తున్నప్పుడు ఆరి్థక ప్రపంచంలో మన మిత్రులు తమదైన అంచనాలు వేసుకుంటారు. 

కానీ, ఇది సాధ్యమేనని మీరు చూ స్తారు. మనందరం సమిష్టిగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని మంత్రి పేర్కొన్నారు. వినియోగంపై ఆధారపడిన ఆరి్థక వ్యవస్థను ఉరకలెత్తించేందుకు ప్రభుత్వం తన వంతుగా కీలక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ విదేశీ వాణిజ్యం విస్తరణకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో ఎగుమతులు 4–5% మేర పెరుగుతాయన్న అంచనాను వ్యక్తం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)