Breaking News

ఐదేళ్లుగా వింత ప్రయోగం.. దొంగతనం కాలేదన్న సీఈఓ!

Published on Fri, 08/14/2026 - 19:10

భారత్ అగ్రి వ్యవస్థాపకుడు, సీఈఓ 'సిద్ధార్థ్ డయలాని' బెంగళూరులో చేసిన ఓ చిన్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన భార్యతో కలిసి గత ఐదేళ్లుగా ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారట. ఎక్కడికి వెళ్లినా బైక్‌ను పార్క్ చేసినప్పుడు హెల్మెట్‌కు ఎలాంటి లాక్ వేయకుండా సీటుపైనో, సైడ్ మిర్రర్‌పైనో పెట్టి వెళ్తున్నారు. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఒక్క హెల్మెట్ కూడా దొంగతనం కాలేదని ఆయన చెప్పడంతో నెట్టింట చర్చ మొదలైంది.

బెంగళూరులో ప్రజలు ఒకరినొకరు ఎంతవరకు నమ్మవచ్చో తెలుసుకోవడాని ఈ ప్రయోగం చేస్తున్నట్లు సిద్ధార్థ్ డయలాని పేర్కొన్నారు. దీనికోసం పెద్దగా పెట్టుబడి పెట్టకుండా.. హెల్మెట్ ప్రయోగం స్టార్ట్ చేశారు. ఐదేళ్లుగా హెల్మెట్లు సురక్షితంగా ఉండటంతో.. బెంగళూరు ఒక హై-ట్రస్ట్ సిటీ అని చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే.. ఈ ప్రయోగానికి వారు ఒక కండిషన్ కూడా పెట్టుకున్నారు. ఏ రోజు తమ హెల్మెట్ దొంగతనానికి గురవుతుందో.. తరువాత ఆ ప్రాంతానికి వెళ్లడం మానేస్తామని సిద్ధార్థ్ చెప్పారు. అంటే.. ఒక్క హెల్మెట్ పోవడం ద్వారా ఆ ప్రాంతంలోని ప్రజలపై తమ నమ్మకం పోయినట్లే అన్నమాట. ఈ విషయం కొంతమంది నెటిజన్లను ఆకట్టుకుంది. చాలామంది తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కొందరు సిద్ధార్థ్ డయలాని చేసిన పనిని మెచ్చుకున్నారు. మరికొందరు విమర్శించారు. ''హెల్మెట్ రేటు తక్కువగా ఉండటం వల్ల ఎవరూ పట్టించుకోకపోయి ఉండొచ్చు.. ఖరీదైనది పెట్టి చూడండి, అప్పుడు అసలు విషయం తెలుస్తుంది'' అంటూ కామెంట్ చేశారు. మరికొందరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం బైక్, హెల్మెట్ రెండూ సురక్షితంగా ఉండకపోవచ్చని హెచ్చరించారు. దీంతో బెంగళూరు మొత్తం ఒకేలా ఉండదని, ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)