Breaking News

మొబైల్‌ డేటాపై పన్నుకు బ్రేక్‌!

Published on Sat, 09/12/2026 - 14:48

దేశంలో మొబైల్‌ డేటా వినియోగంపై ప్రత్యేక పన్ను (డేటా టాక్స్‌) విధించాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవడానికి కేంద్ర టెలికాం శాఖ (డాట్‌) సన్నాహాలు చేస్తోంది. ఈ పన్ను అమలులో ఎదురయ్యే సాంకేతిక చిక్కులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణపై పడే ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం.

నేపథ్యం.. ప్రతిపాదన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో భాగంగా డేటా వినియోగం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు చిన్నారుల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడమే లక్ష్యంగా డేటాపై పన్ను ప్రతిపాదనను పరిశీలించాలని డాట్‌ని ఆదేశించారు. గిగాబైట్‌కు(జీబీ) రూ.1 చొప్పున పన్ను విధించే మోడల్‌ను సెప్టెంబర్ 30 నాటికి రూపొందించాలని తొలుత భావించారు.

ఎదురైన సవాళ్లు

డేటా పన్ను అమల్లో ప్రాథమికంగా కొన్ని సమస్యలు గుర్తించారు. ప్రతి వినియోగదారుడి డేటా వాడకాన్ని సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. ఒకవేళ రీఛార్జ్ ప్యాక్‌లపై నేరుగా పన్ను వేస్తే తక్కువగా వినియోగించే వారికి కూడా అదనపు భారం పడుతుంది. యూపీఐ చెల్లింపులు, ఆన్‌లైన్ విద్య, ఆరోగ్య సేవలు, ఈ-కామర్స్ వంటి నిత్య జీవితంలో డేటా అత్యవసరంగా మారింది. ఉత్పత్తికి ఉపయోగపడే డేటా, ఎంటర్‌టైన్‌మెంట్‌ డేటాను వేరు చేయడం వీలుపడదు. ఇప్పటికే రీఛార్జ్‌లపై 18% జీఎస్టీ చెల్లిస్తున్న వినియోగదారులపై మరింత భారం మోపడం డిజిటల్ ఇండియా ఆశయాలకు విఘాతం కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

డేటా వినియోగ గణాంకాలు

డాట్‌ అధికారిక డేటా ప్రకారం, భారతదేశంలో మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2025లోని 229 బిలియన్ జీబీతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం 2026 నాటికి డేటా వినియోగం 24.5% పెరిగి 285 బిలియన్ జీబీకి చేరుకుంది. డిజిటల్ వ్యసనం, చిన్నారుల్లో స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు పన్నులు విధించడం సరికాదని నిపుణులు స్పష్టం చేశారు. వయస్సు నిర్ధారణ ప్రక్రియ, పేరెంటల్ కంట్రోల్స్, కంటెంట్ నియంత్రణ వంటి సాంకేతిక చర్యల ద్వారా మాత్రమే ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్‌’ ఎకానమీ

Videos

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

రాజీనామా చేసి పార్టీ పెట్టి గెలిచినా నాయకుడు జగన్.. పొత్తు లేకపోతే ఒక్క సీటు గెలిచే దమ్ము లేదు నీకు...

అంబేద్కర్ కోనసీమలో చంద్రబాబుకు బిగ్ షాక్.. ముగ్గురు TDP అధ్యక్షులు రాజీనామా

నువ్వు కాదు కదా నీ... జగన్ పాదయాత్రపై చింతమనేని సవాల్.. కాసు మహేష్ రెడ్డి కౌంటర్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)