Breaking News

సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు..

Published on Thu, 03/30/2023 - 07:28

న్యూఢిల్లీ: ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిపే సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండబోవని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ సాధానాల (పీపీఐ) ద్వారా జరిపే మర్చంట్‌ లావాదేవీలకు మాత్రమే ఇంటర్‌చేంజ్‌ చార్జీలు వర్తిస్తాయని, వాటికి సంబంధించి కస్టమర్లపై చార్జీల భారం ఉండబోదని ఒక ప్రకటనలో వివరించింది.

ఇదీ చదవండి: కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ చమురు ఉత్పత్తి

వాలెట్ల వంటి పీపీఐ సాధనాల ద్వారా రూ. 2,000కు మించి జరిపే చెల్లింపులపై 1.1 శాతం ఇంటర్‌చేంజ్‌ చార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, బ్యాంకులు, ప్రీపెయిడ్‌ సాధనాలు, వ్యాపారవర్గాలకు మాత్రమే ఇది పరిమితం కానున్నప్పటికీ దీనితో కస్టమర్లపై చార్జీల భారం పడనుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్‌పీసీఐ తాజా వివరణ ఇచ్చింది.

మరోమాటలో చెప్పాలంటే ఒక కంపెనీకి చెందిన వాలెట్‌ గల కస్టమరు మరో కంపెనీ వాలెట్‌ ఉన్న వర్తకులకు చెల్లింపులు జరిపినప్పుడు ఈ చార్జీలు వర్తిస్తాయి. రెండు వాలెట్ల మధ్య లావాదేవీలకు సంబంధించిన ఇంటర్‌చేంజ్‌ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి ఈ చార్జీలు సహాయపడతాయి. ప్రస్తుతం మొబైల్‌ వాలెట్‌ పేమెంట్‌ మార్కెట్లో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివి ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. బ్యాంకు ఖాతా లేదా పీపీఐ/పేటీఎం వాలెట్‌ ద్వారా చెల్లింపులు జరిపినా ఏ కస్టమరుకూ ఎటువంటి చార్జీలు ఉండవని పేటీఎం తెలిపింది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు