Breaking News

కొత్త స్కామ్‌తో బ్యాంక్‌ ఖాతా ఖాళీ.. ఎలా కాపాడుకోవాలంటే..

Published on Thu, 01/16/2025 - 14:46

జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ ఇటీవల వెలుగులోకి వస్తోన్న కొత్త స్కామ్‌ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ స్కామ్‌తో మోసగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈమేరకు మోసం జరుగుతున్న విధానాన్ని తెలియజేసేలా సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అటువంటి స్కామర్లు బారిన పడకుండా ఉండాలంటే ఎలా రక్షించుకోవాలో కొన్ని చిట్కాలను అందించారు.

మోసం చేస్తున్నారిలా..

‘అత్యవసరంగా కాల్‌ చేయాలి.. మీ ఫోన్‌ను వినియోగించవచ్చా.. అనేలా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని అడగవచ్చు. అమాయకంగా కనిపించే వ్యక్తులు, వృద్ధులు, చిన్న పిల్లలు.. ఈ స్కామర్ల టార్కెట్‌ కావొచ్చు. వారు మీ ఫోన్‌ తీసుకుని కాల్ చేయడానికి రహస్యంగా పక్కకు వెళితే మాత్రం అనుమానించాలి. ఎందుకంటే స్కామర్ రహస్యంగా తనకు అవరసరమయ్యే యాప్‌లను మీకు తెలియకుండానే డౌన్‌లోడ్‌ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఇప్పటికే ఉన్న యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. బ్యాంకింగ్ అలర్ట్‌లతో సహా కాల్స్, మెసేజ్‌లను వారి నంబర్లకు ఫార్వర్డ్ చేయడానికి మీ ఫోన్‌లో సెట్టింగ్లను మార్చవచ్చు. దీని ద్వారా వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను(ఓటీపీలు) అడ్డుకుని అనధికార లావాదేవీలు నిర్వహించుకోవచ్చు’ అని కామత్‌ అన్నారు.

ఇదీ చదవండి: పాత పన్ను విధానం తొలగింపు..?

ఏం చేయాలంటే..

‘మీ ఫోన్ ను అపరిచితులకు అప్పగించవద్దు. అందుకు బదులుగా ఆ నంబర్‌ను మీరే డయల్ చేసి స్పీకర్‌ ఆన్‌లో పెట్టి మాట్లాడాలని సూచించాలి. ఇలాంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే స్కామర్లు సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా నిరోధించే అవకాశం ఉంది’ అన్నారు. కామత్ షేర్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో 4,50,000 మందికి పైగా వీక్షించారు. చాలా మంది వినియోగదారులు తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాలకు సంబంధించి వారి సొంత అనుభవాలను పంచుకున్నారు. విభిన్న భాషల్లో ఉన్న జెరోధా వినియోగదారులు, తన ఫాలోవర్ల కోసం ఇలాంటి అవగాహన వీడియోను ఇతర భాషల్లోకి అనువదించాలని కొందరు సూచించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)