Breaking News

నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లాంచ్‌: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్‌ 

Published on Sat, 04/01/2023 - 11:18

సాక్షి: ముంబై:  రిలయన్స్‌ అధినేత  ముఖేశ​ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ  డ్రీమ్‌  ప్రాజెక్ట్‌ ‘ఎన్‌ఎంఏసీసీ’ (నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌) ఘనంగా లాంచ్‌​ అయింది. ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్‌ఎంఏసీసీ ఆరంభోత్సవానికి పలువురు  రాజకీయ,  వ్యాపార వర్గాల, క్రీడా రంగ  ప్రముఖులు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేశారు.

ఈ వేడుకల్లోఅంబానీ కుటుంబసభ్యులు, కాబోయే జంట అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  బాలీవుడ్‌, హాలీవుడ్‌, సౌత్‌ సినీ పరిశ్రమలకు చెందిన తారలు  మెరిసారు.  ముఖ్యంగా తమిళ సూపర్‌ స్టార్‌  రజనీకాంత్‌ ఆయన కుమార్తె సౌందర్య, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, ఆయన సతీమణి గౌరీ ఖాన్‌, కుమారుడు ఆర్యన్‌ఖాన్‌, కుమార్తె సుహానా ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, భార్య మీరాతో  కలిసి షాహిద్‌ కపూర్‌ రాజ్‌పుత్‌  ఉన్నారు.

ఇంకా దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంకా చోప్రా, నిక్‌ జొనాస్‌ జంటతోపాటు శ్రద్ధాకపూర్‌, జాన్వీకపూర్‌, సోనం కపూర్‌, అలియాభట్‌, కొత్త జంట సిద్ధార్థ్‌ మల్హోత్ర, కియారా  తదితర అతిరధమహారథులంతా ఈ వేడుకలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు.  ఇంకా టీవీ ప్రముఖులలో రాహుల్ వైద్య, దిశా పర్మార్ , తారక్ మెహతా కా ఊల్తా చష్మా,  జెతలాల్ ఏకేఏ దిలీప్ జోషిగాయని శ్రేయా కూడా కనిపించారు.

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుటుంబం, అమృత ఫడ్నవీస్‌తో దేవేంద్ర ఫడ్నవిస్, ఎస్‌బీఐ మాజీ మాజీ చీఫ్‌ అరుంధతి భట్టాచార్య,సద్గురు కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. గ్రాండ్ ఓపెనింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కొత్త శకానికి నాంది: అంబానీ
నీతా చిరకాల స్వప్నం నెరవేరడంపై స్పందించిన  ముఖేశ్‌ అంబానీ స్పందిస్తూ  ఇది భావి భారతానికి కళలు ,  సంస్కృతికి కొత్త శకానికి నాంది అని వ్యాఖ్యానించారు. నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్ సెంటర్ లేదా ఎన్‌ఎంఏసీసీ అని కూడా పిలుస్తారు. భారతీయ సంస్కృతి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా  అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఇది. గ్రాండ్ లాంచ్‌కి పలువురు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)