Breaking News

నీతా అంబానీకి అరుదైన గౌరవం

Published on Sun, 02/16/2025 - 20:42

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీకి (Nita Ambani) అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. ఆమె దార్శనిక నాయకత్వం, సమాజానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేసింది. మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలే చేతుల మీదుగా నీతా అంబానీ ఈ ప్రశస్తిని అందుకున్నారు.

మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రం గురించి తెలియజేస్తూ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, మహిళా సాధికారత వంటి వివిధ రంగాలలో నీతా అంబానీ గణనీయమైన ప్రభావాన్ని చూపారంటూ రిలయన్స్ ఫౌండేషన్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’ ద్వారా తెలిపింది.

"మా వ్యవస్థాపక చైర్‌పర్సన్ నీతా అంబానీని దార్శనిక నాయకురాలిగా, వితరణశీలిగా, అసలైన గ్లోబల్‌ గేమ్‌ఛేంజర్‌గా గుర్తిస్తూ మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలే ప్రతిష్టాత్మక గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేశారు" అని రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్‌లో వివరించింది.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నీతా అంబానీ చేతితో నేసిన అద్భుతమైన శికార్గా బనారసి చీర ధరించి పాల్గొన్నారు. భారతీయ కళా నైపుణ్యానికి ఉదాహరణగా నిలిచే ఈ చీర అధునాతన కడ్వా నేత నైపుణ్యం, సాంప్రదాయ కోన్యా హంగులను సంతరించుకుంది. నీతా అంబానీ ఈ చీరను ధరించడం ద్వారా భారతదేశ కళాత్మక వారసత్వ వైభవాన్ని మరోసారి అంతర్జాతీయంగా చాటారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)