Breaking News

61 ఏళ్ల వయసులో నీతా అంబానీ ఫిటెనెస్‌ సీక్రెట్‌ ఇదే..

Published on Sat, 03/08/2025 - 13:58

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ(61) ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన రోజువారీ ఫిట్‌నెస్‌ షెడ్యూల్‌ను పంచుకున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఈమేరకు ఒక వీడియో విడుదల చేశారు. అదికాస్తా వైరల్‌ అవుతోంది.

వీడియోలో నీతా అంబానీ తెలిపిన వివరాల ప్రకారం..‘రోజూ 5,000 నుంచి 7,000 అడుగులు నడుస్తాను. నేను చురుకుగా ఉండటానికి సరళమైన ప్రభావవంతమైన మార్గం ఇది. దినచర్యలో భాగంగా నిత్యం జిమ్ వ్యాయామాలు, స్విమ్మింగ్, యోగా, ఆక్వా వ్యాయామాలు ఉంటాయి. అదనంగా డ్యాన్స్‌ చేస్తాను. ఇది నన్ను శారీరకంగా ఫిట్‌గా ఉంచడంతోపాటు మానసిక స్థితికి ఎంతో తోడ్పాటు అందిస్తోంది. ప్రతిరోజూ #StrongHERMovement(ట్విటర్‌-ఎక్స్‌లో ట్యాగ్‌)లో చేరి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మరింత దృఢంగా మారి ఎన్నో విజయాలు సాధించాలి’ అన్నారు.

‘షుగర్‌-ఫ్రీ’ లైఫ్‌స్టైల్‌

నీతా అంబానీ ఫిట్‌నెస్‌ జర్నీలో ఆహారం కీలక అంశమని తెలిపారు. ఆర్గానిక్‌, ప్రకృతి ఆధారిత ఆహార పదార్థాలపై దృష్టి సారించాలని సూచించారు. తాను ఎప్పుడూ శాకాహారం తీసుకుంటానని పేర్కొన్నారు. ఆమె షుగర్‌(చక్కెర ఉండే పదార్థాలు) అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. సమతుల భోజనం, ప్రోటీన్లు, పోషకాలు సమృద్ధిగా ఉండేలా జాగ్రత్త పడతానని చెప్పారు.

ఆరోగ్యానికి 30 నిమిషాలు

మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాలపాటు వారి ఆరోగ్యానికి సమయం కేటాయించాలని నీతా అంబానీ సూచించారు. ఫిట్‌నెస్‌ అంటే వయసుతో పోరాడటం కాదని, దాన్ని పాజిటివిటీతో స్వీకరించడం అని నొక్కి చెప్పారు. నీతా ఫిట్‌నెస్‌ సందేశం అన్ని వయసుల మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. అతివల స్వీయ సంరక్షణ, శ్రేయస్సుకు ఎంతో దోహదం చేస్తుంది. ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండాలనుకునేవారికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)