Breaking News

హార్వర్డ్ యూనివర్సిటీలో నీతా అంబానీ ప్రసంగం

Published on Thu, 02/13/2025 - 08:56

భారతీయ వ్యాపారం, విధానాలు, సంస్కృతిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రిలయన్స్(Reliance) ఫౌండేషన్ గౌరవ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ(Nita Ambani) కీలకోపన్యాసం చేయనున్నారు. 2025 ఫిబ్రవరి 15 నుంచి 16 వరకు జరిగే వార్షిక ఇండియా కాన్ఫరెన్స్‌లో ఆమె ప్రసంగిస్తారు. ఈ సదస్సుకు విధానకర్తలు, వ్యాపారవేత్తలు, మేధావులతో సహా 1,000 మందికి పైగా ప్రతినిధులు హాజరువుతున్నారు.

ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా నీతా అంబానీ ప్రముఖ విద్యావేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియాతో భారతదేశ కళలు, సంస్కృతి, ఆధునిక ప్రపంచంలో భారతదేశం పాత్ర వంటి అంశాలపై చర్చిస్తారు. ప్రపంచ వేదికలపై దేశం తరఫున వివిధ అంశాలపై మాట్లాడే ప్రభావవంతమైన వ్యక్తుల్లో నీతా అంబానీ ఒకరిగా నిలిచారు. కళలు, హస్తకళలు, క్రీడలు, విద్య, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆమె ఎంతో సేవలందిస్తున్నారు.

ఇదీ చదవండి: నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి వృద్ధి

వార్షిక ఇండియా కాన్ఫరెన్స్‌కు సంబంధించి ఈ సంవత్సరం థీమ్ ‘ఫ్రమ్‌ ఇండియా టు ది వరల్డ్‌’గా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, శ్రేయస్సు కోసం భారతీయ ప్రయత్నాలు ఎలా ఉన్నాయో, దేశంలో అనుసరిస్తున్న విధానాలు, వాటి రూపకల్పన వంటి వాటిపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చ జరగనుంది. 22 సంవత్సరాలకు పైగా హార్వర్డ్ విద్యార్థులు వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, విద్య, సంస్కృతి వంటి విభిన్న విభాగాలకు చెందిన నిపుణులు ఈ కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు ఆతిథ్యం ఇస్తున్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)