Breaking News

పిల్లలతో నీతా అంబానీ: కొత్త పథకంతో లక్ష మందికి మేలు

Published on Thu, 11/14/2024 - 21:04

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & ఛైర్‌పర్సన్ 'నీతా అంబానీ' బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్‌లో ప్రతి జీవితం విలువైనదని మేము విశ్వసిస్తున్నాము. ప్రతి బిడ్డ సంతోషంగా, ఆరోగ్యంగా పెద్ద కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి అర్హులు అని వ్యాఖ్యానించారు.

బాలల దినోత్సవం సందర్భంగా.. కొత్త ఆరోగ్య సేవా పథకాన్ని ప్రారంభించినట్లు నీతా అంబానీ ప్రకటించారు. పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు & మహిళలపై దృష్టి సారించి, అట్టడుగు వర్గాలకు చెందిన 1,00,000 మంది వ్యక్తులకు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైన ఆరోగ్య పరీక్షలు మరియు చికిత్సలను అందించడం ఈ చొరవ లక్ష్యం అని పేర్కొన్నారు.

ఈ సంవత్సరం, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి.. మా కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రవేశపెట్టడం గర్వకారణంగా ఉందని, నీతా అంబానీ పేర్కొన్నారు. అంతే కాకుండా.. 50,000 మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత పరీక్షలు చేసి తగిన చికిత్సను అందించడం, 50వేల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌లతో పాటు 10,000 మంది కౌమార బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాధి నిరోధక టీకాల వంటి వాటికి సంబంధించిన లక్ష్యాలను నీతా అంబానీ వెల్లడించారు.

ప్రారంభం నుంచి రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 1,50,000 కంటే ఎక్కువమంది పిల్లలతో సహా సుమారు 27 లక్షల కంటే ఎక్కువమంది భారతీయులకు సేవలందించింది. భారతదేశంలోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌గా గుర్తింపు పొందిన ఈ సంస్థ నాణ్యమైన సేవలను అందిస్తోంది.

బాలల దినోత్సవానికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నీతా అంబానీ.. పిల్లలతో ముచ్చటించడం, పిల్లకు కేక్ తినిపించడం వంటివి కూడా చూడవచ్చు. అంతే కాకుండా రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ద్వారా మేలు పొందిన వారు సంస్థకు కృతజ్ఞతలు చెప్పడం కూడా ఇక్కడ చూడవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)