Breaking News

నిస్సాన్ మాగ్నైట్‌కు రీకాల్: 1500 కార్లు వెనక్కి!

Published on Fri, 09/19/2025 - 08:06

నిస్సాన్ కంపెనీ అక్టోబర్ 2024లో మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీంతో సంస్థ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ సెటప్‌తో భారతదేశంలో తయారు చేసిన మాగ్నైట్‌ను సౌదీ అరేబియాకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. అదే సమయంలో దేశీయ విఫణిలో విక్రయించడానికి కూడా ఉత్పత్తి చేస్తోంది. కాగా ఇప్పుడు సౌదీ అరేబియా మార్కెట్లో విక్రయించిన నిస్సాన్ మాగ్నైట్ కోసం బ్రాండ్ రీకాల్ జారీ చేసింది.

బ్రేక్ పైపు, హీట్ షీల్డ్ మధ్య తగినంత ఖాళీ లేకపోవడం వల్ల కలిగే భద్రతా సమస్యను నిస్సాన్ గుర్తించింది. ఇది బ్రేక్ పెడల్ పనితీరును దెబ్బతీస్తుందని.. ప్రమాదానికి కారణమవుతుందని కంపెనీ వెల్లడించింది. బ్రేక్ ఫ్లూయిడ్ లీకేజీకి కూడా దారితీస్తుందని కూడా సంస్థ పేర్కొంది. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి నిస్సాన్ రీకాల్ జారీచేసింది. ఈ రీకాల్ నిర్ణయం సౌదీ అరేబియాలోని మొత్తం 1,552 యూనిట్ల మాగ్నైట్ ను ప్రభావితం చేయబోతోంది. అయితే నిస్సాన్ మోటార్ ఇండియా భారతదేశానికి సంబంధించిన మోడళ్లకు ఎటువంటి రీకాల్ జారీ చేయలేదు.

ఇదీ చదవండి: ఈ20 ఫ్యూయెల్ ఎఫెక్ట్.. ఫెరారీ స్టార్ట్ అవ్వడం లేదట!!

భారతదేశం, సౌదీ అరేబియాలో విక్రయించే నిస్సాన్ మాగ్నైట్ మోడల్‌లు ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను పంచుకుంటాయి. తేడా ఏమిటంటే ఇండియాలో రైట్ హ్యాండ్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ అయితే.. సౌదీ అరేబియాలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్. ఈ కారణంగానే బ్రేక్ ఫ్లూయిడ్ పైపుల రూటింగ్ అనేది కొంత భిన్నంగా ఉంటుంది. ఇదే సమస్యకు దారితీసినట్లు స్పష్టమవుతోంది.

Videos

America: పోలీసుల చేతిలో యువకుడు హతం

Machilipatnam: పోలీసుల తీరుపై YSRCP నేతల ఆగ్రహం

Perni Nani: ఇంట్లో పడుకుంటే పని అవ్వదూ... విలేకర్ ప్రశ్నకు పేర్ని నాని సమాధానం అదుర్స్

Prakasham Dist: బాబు పక్కా రాజకీయ వ్యాపారి బినామీల కోసమే ప్రైవేటీకరణ

అందుబాటులో ఉండడం లేదన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ

Perni Nani: పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు

మచిలీపట్నంలో YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు

ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఆందోళనలు ఆగవని YSRCP హెచ్చరిక

ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు

రూ.6 వేల కోట్లు ఇవ్వడానికి చేతులు పడిపోయినాయా బాబూ..

Photos

+5

కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ.. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై ఉవ్వెత్తున ఉద్య‌మం (చిత్రాలు)

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)