Breaking News

‘బ్యాంకులు అప్పులు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి’

Published on Sat, 06/28/2025 - 14:39

కీలక వడ్డీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ అర శాతం తగ్గించడాన్ని అవకాశంగా అందిపుచ్చుకుని, ఉత్పాదక రంగాలకు మరిన్ని రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. పీఎస్‌బీల రుణ వృద్ధి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

గత ఆర్థిక సంవత్సరం స్థాయిలో లేదా అంతకు మించిన స్థాయిలో రుణ వృద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి సూచించినట్లు వారు వివరించారు. పీఎస్‌బీల ఆర్థిక పనితీరును సమీక్షించేందుకు ఆయా బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. ఆర్థిక సమ్మిళితత్వం సాధించేందుకు ప్రభుత్వ పథకాల్లో మరింత మంది కస్టమర్లను చేర్చేందుకు కృషి చేయాలని మంత్రి చెప్పారు.

ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచన

తక్కువ వ్యయాలతో కూడుకున్న డిపాజిట్లను సమీకరించే మార్గాలు అన్వేషించాలని మంత్రి సూచించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్, పీఎం ముద్రా, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన తదితర పథకాల పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 12 పీఎస్‌బీల మొత్తం లాభం 26 శాతం వృద్ధి చెంది రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)