Breaking News

వాట్సప్‌ మేసేజ్‌లతో రూ.90 కోట్లు రికవరీ

Published on Fri, 03/28/2025 - 13:47

పన్ను ఎగవేతదారులు, ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలు, ఈమెయిల్స్‌ను యాక్సెస్ చేసే వెసులుబాటును పన్ను అధికారులకు కల్పించే ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. అక్రమ సిండికేట్ నుంచి రూ.90 కోట్లకు పైగా క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వాట్సాప్ సందేశాలను డీక్రిప్ట్‌ చేయడం ఎంతో తోడ్పడిందని గుర్తు చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లులోని నిబంధనలపై పార్లమెంట్‌లో ఆమె మాట్లాడారు.

ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్ ఛానళ్ల దుర్వినియోగం పెరుగుతోందని, మనీలాండరింగ్, పన్ను ఎగవేత వంటి కార్యకలాపాల కోసం నేరగాళ్లు వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘1961 ఆదాయపు పన్ను చట్టంలో ఫిజికల్ బుక్స్ ఆఫ్ అకౌంట్, లెడ్జర్లు, మాన్యువల్ రికార్డుల గురించే ప్రస్తావించారు. డిజిటల్ రికార్డులను ప్రస్తావించలేదు. ఫిజికల్‌ లెడ్జర్లను చూపించినప్పటికీ డిజిటల్ రికార్డులు ఎందుకు అవసరమని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే ఇది ఎంతో అవసరం. ఈ రెండింటి మధ్య లోటును పూడ్చడమే కొత్త బిల్లు లక్ష్యం’ అని ఆమె పార్లమెంటులో అన్నారు.

‘ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజ్‌లు, మొబైల్ ఫోన్లలోని వివరాలు స్కాన్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను అధికారులు ఇప్పటికే రూ.250 కోట్లు లెక్కల్లోకి రాని నిధులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రూ.200 కోట్ల బోగస్ బిల్లులకు పాల్పడిన సిండికేట్లు, తప్పుడు పత్రాలతో భూముల అమ్మకంలో మూలధన లాభాలను తారుమారు చేసిన ఉదంతాలున్నాయి. ఇవి వాట్సాప్ ద్వారా బట్టబయలయ్యాయి. లెక్కల్లోకి రాని లావాదేవీలను ట్రాక్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ హిస్టరీలను కూడా ఉపయోగించాం. బినామీ ఆస్తులను గుర్తించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రొఫైల్స్ సహాయపడ్డాయి’ అని ఆమె అన్నారు. అయితే ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలు ఎలా యాక్సెస్ అయ్యాయో మాత్రం ఆమె వివరించలేదు.

ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల(300 కోట్ల) మంది యూజర్లు ఉన్నారని చెప్పుకునే మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కేంద్ర ప్రతిపాదిత చట్టంపై స్పందించలేదు. మెటా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ సందేశాలను షేర్‌ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. అంటే మీరు కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తికి, మీకు మధ్య వ్యక్తిగత సందేశాలను షేర్‌ చేస్తుంది. దీన్ని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎవరూ చదవలేరు, వినలేరు, షేర్ చేయలేరని కంపెనీ గతంలో తెలిపింది. కానీ ఈ డేటాను ప్రభుత్వం ఎలా ఉపయోగించిందో తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: కోహ్లీ లేకపోతే.. టీసీఎస్‌ లేదు

వాట్సాప్, భారత ప్రభుత్వం మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 కింద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మెసేజ్‌ ముందుగా షేర్‌ చేసిన మూలకర్తను గుర్తించాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఆదేశాలను సవాలు చేస్తూ వాట్సాప్ 2021లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దావా వేసింది. తన ఎన్‌క్రిప్షన్‌ ప్రమాణాల విషయంలో రాజీపడవలసి వస్తే భారత మార్కెట్ నుంచి నిష్క్రమించేందుకై వెనుకాడబోమని 2024 ఏప్రిల్‌లో వాట్సప్‌ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

22222
33334
22331
1233


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)