Breaking News

అన్నింటా రికార్డులే.. నిర్మలమ్మ ఖాతాలో మరో ఘనత

Published on Sun, 07/21/2024 - 14:45

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ సెషన్ 2024 ఆగస్టు 12న ముగుస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రకటనను అనుసరించి భారీ అంచనాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

మోదీ 3.0 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి సీతారామన్ తన 7వ బడ్జెట్‌ను జూలై 23న ఉదయం 11 గంటలకు సమర్పించనున్నారు. ఇప్పటికే ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సీతారామన్.. ఏడవ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. గతంలో ఐదుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు. కాగా ఈ రికార్డును నిర్మలా సీతారామన్ బ్రేక్ చేయనున్నారు.

1959 నుంచి 1964 వరకు మొరార్జీ దేశాయ్ ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపట్టారు. మొత్తం మీద దేశాయ్ 10సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు కూడా అత్యధికసార్లు బడ్జెట్ సమర్పించిన రికార్డ్ ఈయన పేరుమీదనే ఉంది. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ విషయంలో మాత్రమే ఆ రికార్డును సీతారామన్ బ్రేక్ చేయనున్నారు.

నిజానికి ఇందిరా గాంధీ తరువాత బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా కూడా నిర్మలా సీతారామన్ ఖ్యాతిగడించారు. భారతదేశంలో ఎక్కువకాలం ఆర్ధిక మంత్రిగా పనిచేసిన మహిళ కూడా సీతారామన్ కావడం గమనార్హం.

బ్రీఫ్‌కేస్‌ విధానానికి మంగళం పాడి.. జాతీయ చిహ్నం కలిగిన బుక్ తరహాలో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చే సంప్రదాయాన్ని, పేపర్‌లెస్ కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం, అత్యల్ప బడ్జెట్ ప్రసంగాలకు సంబంధించిన రికార్డులు కూడా సీతారామన్ ఖాతాలోనే ఉన్నాయి.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)