Breaking News

Budget 2024: ఆమె పద్దు ఆరోసారి..

Published on Fri, 01/26/2024 - 19:29

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డ్‌ సృష్టించబోతున్నారు. ఈ ఫిబ్రవరి 1వ తేదీన ఆమె వరుసగా ఆరో బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. వీటిలో ఐదు వార్షిక బడ్జెట్‌లు కాగా ఇప్పుడు ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్‌. ఇప్పటివరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

నిర్మలమ్మ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా వరుసగా ఐదు బడ్జెట్‌లను సమర్పించిన మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, యశ్వంత్ సిన్హా వంటి మాజీ ఆర్థిక మంత్రుల రికార్డులను అధిగమించనున్నారు. 

ఆయన పదిసార్లు 
అత్యధిక సార్లు బడ్జెట్‌లను ప్రవేపెట్టిన రికార్డ్‌ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఉంది. మొత్తంగా ఆయన పది బడ్జెట్‌లను సమర్పించారు. ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఏ ఆర్థిక మంత్రికి అయినా గరిష్టంగా ఒక మధ్యంతర బడ్జెట్‌ సహా వరుసగా ఆరు బడ్జెట్‌లను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వంలోనూ మరో పర్యాయం ఆర్థిక మంత్రిగా కొనసాగితే మరిన్ని బడ్జెట్లు సమర్పించే వీలుంటుంది.

ఫిబ్రవరి 1న నిర్మలా  సీతారామన్ సమర్పించనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్ సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు నిర్దిష్ట మొత్తాలను ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చే ఓట్-ఆన్-అకౌంట్‌గా ఉంటుంది. పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నందున ఈ మధ్యంతర బడ్జెట్‌లో పెద్ద విధానపరమైన మార్పులు ఉండకపోవచ్చు. ఇదే విషయాన్ని గత నెలలో జరిగిన ఒక పరిశ్రమ ఈవెంట్‌లో నిర్మలా సీతారామన్‌ చెప్పారు. మధ్యంతర బడ్జెట్‌లో ఎటువంటి "అద్భుతమైన ప్రకటన" ఉండదని, ఇది సాధారణ ఎన్నికలకు ముందు ఓటు-ఆన్-అకౌంట్ మాత్రమే అని అన్నారు.

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)