Breaking News

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు: సీతమ్మ సరికొత్త రికార్డులు

Published on Wed, 01/31/2024 - 12:38

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బుధవారం ఉదయం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేస్తున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.

గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. దీంతో ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేయనున్నారు. 

ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ వరుసగా ఆరవ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డును సమం చేయనున్నారు. 

2019 జూలై నుంచి వరుసగా ఐదు సంవత్సరాలు దేశానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అందించిన మహిళా ఆర్థికమంత్రి సీతారామన్‌. ఈ వారంలో ఆరవసారి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

మొరార్జీ దేశాయ్‌ ఆర్థిక మంత్రిగా 1959–1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.  

వరుసగా ఐదు బడ్జెట్‌లు సమర్పించిన ఆర్థిక మంత్రుల జాబితాలో నిర్మలా సీతారామన్‌. గతంలో మన్మోహన్‌ సింగ్, అరుణ్‌ జైట్లీ, పీ చిదంబరం, యశ్వంత్‌ సిన్హా ఐదుసార్లు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. ఆరో బడ్జెట్‌తో కొత్త రికార్డు నెలకొల్పనున్న నిర్మలా సీతారామన్‌. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)