Breaking News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రూ. 675 కోట్ల పెట్టుబడులు

Published on Fri, 12/22/2023 - 07:25

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ గ్రూప్‌ ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టులో నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌) రూ. 675 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేయనుంది. విమానాశ్రయ నిర్మాణానికి ఏర్పాటైన జీఎంఆర్‌ విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (జీవీఐఏఎల్‌)లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌), ఎన్‌ఐఐఎఫ్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

సీసీడీల రూపంలో..
కంపల్సరీ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ రూపంలో ఎన్‌ఐఐఎఫ్‌ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు జీఎంఆర్‌ గ్రూప్‌ తెలిపింది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ప్రాజెక్టులకు సంబంధించి ఇది తమ రెండో పెట్టుబడని ఎన్‌ఐఐఎఫ్‌ మాస్టర్‌ ఫండ్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ వినోద్‌ గిరి తెలిపారు. హైదరాబాద్‌ తరహాలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ మరో ప్రపంచ స్థాయి విమానాశ్రయంగా ఉండగలదని జీఎంఆర్‌ గ్రూప్‌ బిజినెస్‌ చైర్మన్‌ (ఎయిర్‌పోర్ట్స్‌) జీబీఎస్‌ రాజు తెలిపారు.

డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన 40 ఏళ్ల వ్యవధికి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును 2020లో జీవీఐఏఎల్‌ దక్కించుకుంది. ఏపీలోనే అతి పెద్ద విమానాశ్రయంగా ఆవిర్భవించనున్న ఈ ఎయిర్‌ పోర్టు వార్షిక ప్రయాణికుల సామర్థ్యం తొలి దశలో 60 లక్షలుగా ఉంటుంది. తర్వాత 4 కోట్లకు చేరనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)