Breaking News

ఒమిక్రాన్‌ భయాలతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Published on Mon, 12/20/2021 - 16:01

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. గత వారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ఇంకా, ఇన్వెస్టర్లలో ఒమిక్రాన్‌ భయాలు విడకపోవడంతో భారీగా నష్టపోయాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లకు ఊరటనిచ్చే అంశాలేవీ లేకపోవడంతో పాటు ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. యూరోప్ దేశాల్లో మరోమారు లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉండటంతో మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి.

చివరకు, సెన్సెక్స్ 1,189.73 పాయింట్లు (2.09%) క్షీణించి 55,822.01 వద్ద నిలిస్తే, నిఫ్టీ 371.00 పాయింట్లు (2.18%) కోల్పోయి 16,614.20 వద్ద ముగిసింది.  నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.92 వద్ద ఉంది. నిఫ్టీలో భారీగా నష్టపోయిన వాటిలో బీపీసీఎల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు ఉన్నాయి. ఎక్కువ లాభపడిన వాటిలో సిప్లా, హెచ్‌యుఎల్, డాక్టర్ రెడ్డిస్ కంపెనీలు ఉన్నాయి. రియాల్టీ, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ సూచీలు 3-4 శాతం పడిపోవడంతో నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 3 శాతానికి పైగా పడిపోయాయి.

(చదవండి: ఈ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్ కొన్నారా.. అయితే, వెంటనే షోరూమ్ తీసుకెళ్లండి!)

Videos

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)