Breaking News

3డీ సెన్సార్లతో రహదారి లోపాలు గుర్తింపు

Published on Thu, 10/23/2025 - 09:49

రహదారి భద్రతను, మౌలిక సదుపాయాల నాణ్యతను గణనీయంగా పెంచే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 20,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను కవర్ చేస్తూ అధునాతన 3డీ సెన్సార్లు, డేటా సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది.

సాంకేతికతతో పర్యవేక్షణ

ఈ ప్రాజెక్టులో భాగంగా రహదారుల ఉపరితల లోపాలను (గుంతలు, పగుళ్లు వంటివి) అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి ప్రత్యేకంగా అమర్చిన వాహనాలను ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాటు చేయనుంది. ఈ వాహనాల్లో 3డీ లేజర్ ఆధారిత స్కానింగ్ వ్యవస్థలు సిద్ధం చేస్తుంది. ఇందులో గుర్తించిన లోపాలను ఇనెర్షియర్‌ మెజర్‌మెంట్‌ యూనిట్స్‌(IMU) ద్వారా జియోట్యాగ్ చేయడానికి జీపీఎస్ (GPS) ఉంటుంది. ఈ టెక్నాలజీల సాయంతో రియల్‌టైమ్‌ డేటా సేకరిస్తూ దాన్ని విశ్లేషించే వీలుంటుంది. దాని ద్వారా సమర్థవంతమైన నిర్వహణ సాధ్యమవుతుంది.

డేటా లేక్

ఇలా సేకరించిన మొత్తం డేటా ఎన్‌హెచ్‌ఏఐ ఏఐ ఆధారిత పోర్టల్ ‘డేటా లేక్’లో అప్‌లోడ్‌ అవుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఆ డేటాను విశ్లేషించి కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ డేటా ఆధారిత విధానం రహదారి ఇన్వెంటరీ మేనేజ్మెంట్, నిర్వహణ, మౌలిక సదుపాయాల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. సేకరించిన డేటాను ప్రామాణిక ఫార్మాట్లలో భద్రపరచనున్నారు. ఇది దీర్ఘకాలిక సాంకేతిక, ప్రణాళిక ప్రయోజనాలకు తోడ్పడుతుంది.

భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రోడ్డు అభివృద్ధి పనులకు ముందే డేటా సేకరణ ప్రారంభమవుతుంది. ఆరు నెలలపాటు ఇది కొనసాగుతుంది. రెండు నుంచి ఎనిమిది లేన్ల రహదారులతో కూడిన అన్ని ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది.

ఇదీ చదవండి: గూగుల్‌కు పోటీగా ఓపెన్‌ఏఐ కొత్త బ్రౌజర్‌

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)