Breaking News

తత్కాల్‌ కొత్త రూల్‌ తెలుసు కదా.. ఆధార్‌ లింక్‌ చేశారా మరి!?

Published on Mon, 06/16/2025 - 15:30

తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ విధానంలో భారతీయ రైల్వే కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. జూలై 1 నుంచి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) యాప్, వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది.

ఆన్‌లైన్‌ తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ ప్రక్రియలో ఏఐ బోట్‌లు, ఏజెంట్ల బెడదను నివారించేందుకు తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తత్కాల్ అనేది ఇండియన్‌ రైల్వే ఫాస్ట్ ట్రాక్ టికెట్ బుకింగ్ వ్యవస్థ. దీని ద్వారా అప్పటికప్పుడు ప్రయాణానికి ఒక రోజు ముందు తక్కువ సమయంలో రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

👉ఇది చదవలేదా? వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం

ఇండియన్‌ రైల్వే అమలు చేస్తున్న కొత్త రూల్‌ ప్రకారం.. ఆన్‌లైన్‌లో తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకోవాలంటే.. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు యూజర్‌ ఆధార్‌ లింక్‌ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం కావాల్సినవి యాక్టివ్ ఐఆర్‌సీటీసీ అకౌంట్, ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, ఓటీపీ వెరిఫికేషన్ కోసం మొబైల్ ఫోన్.

ఆధార్‌ లింక్‌ చేసుకోండిలా..

  • ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ ( www.irctc.co.in )లోకి లాగిన్ అవ్వాలి.

  • 'మై అకౌంట్'పై క్లిక్ చేసి 'అథెంటికేట్ యూజర్' ఎంచుకోండి.

  • మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.

  • 'వెరిఫై డీటెయిల్స్ అండ్ రిసీవ్ ఓటీపీ'పై క్లిక్ చేయాలి.

  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.

  • సమ్మతి బాక్సును టిక్ చేసి 'సబ్మిట్' నొక్కండి.

  • మీ ఆధార్ విజయవంతంగా లింక్ అయిన తర్వాత ధ్రువీకరణ కన్పిస్తుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)