Breaking News

పెరిగిపోతున్న ప్రాధాన్యత.. దేశంలో 11 షాపింగ్‌ మాల్స్‌

Published on Sat, 01/13/2024 - 09:37

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో కొత్తగా 11 షాపింగ్‌ మాల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటి మొత్తం విస్తీర్ణం 59.48 లక్షల చదరపు అడుగులు అని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక వెల్లడించింది. భారతీయ మార్కెట్లోకి ప్రవేశం, విస్తరించడం కోసం రిటైలర్ల నుండి బలమైన ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తోందని వివరించింది.

అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ విధానాలను మార్చడం, సహాయక వ్యాపార వాతావరణం ఈ వృద్ధికి ఆజ్యం పోసిందని తెలిపింది. ‘ఏడు ప్రధాన నగరాల్లో ఈ మాల్స్‌ ఏర్పాటయ్యాయి. 2022తో పోలిస్తే గతేడాది  కొత్తగా తోడైన రిటైల్‌ స్పేస్‌లో 72 శాతం వృద్ధి నమోదైంది. 2022లో హైదరాబాద్, పుణే, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్, ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కత నగరాల్లో నూతనంగా 34.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనమిది మాల్స్‌ ప్రారంభం అయ్యాయి’ అని నివేదిక తెలిపింది. 

హైదరాబాద్‌లోనే అధికం.. 
‘గతేడాది అందుబాటులోకి వచ్చిన మాల్స్‌లో హైదరాబాద్‌ ఏకంగా మూడు మాల్స్‌ను సొంతం చేసుకుంది. పుణే, చెన్నై రెండు, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్, ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్‌ ఒక్కొక్కటి చేజిక్కించుకున్నాయి. కోవిడ్‌ తదనంతరం ఈ నగరాల్లో ఇంత మొత్తంలో రిటైల్‌ స్పేస్‌ తోడవడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో ఈ జోరు కొనసాగుతుంది.

2019లో కొత్తగా సుమారు 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేడ్‌–ఏ, బీ–ప్లస్‌ మాల్స్‌ తెరుచుకున్నాయి. 2020–22 మధ్య ఏటా సగటున 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్‌ స్పేస్‌ తోడైంది. కోవిడ్‌ తదనంతరం చాలా గ్రేడ్‌–ఏ మాల్స్‌ ఖాళీ లేక రిటైలర్లు నాణ్యమైన రిటైల్‌ స్థలం కొరతను ఎదుర్కొన్నారు’ అని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ వివరించింది.    

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)