Breaking News

శాంసంగ్‌ గెలాక్సీ 5జి మొబైల్స్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్: ఈ రోజే లాస్ట్

Published on Thu, 03/23/2023 - 13:42

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త శాంసంగ్‌ గెలాక్సీ ఏ54 5జీ, ఏ34 5జీ మొబైల్స్ ఎట్టకేలకు సేల్‍కు వచ్చాయి. కంపెనీ ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ మీద ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా తీసుకువచ్చింది. ఈ 5జి మొబైల్స్ మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి.

కొత్త శాంసంగ్‌ గెలాక్సీ ఏ54 5జీ & ఏ43 5జీ రెండూ కూడా ఈ రోజు (మార్చి 23) నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఏ54 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ. 38,999, కాగా 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ. 40,999.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ34 5జీ ధరల విషయానికి వస్తే, ఇందులో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ. 30,999 కాగా, టాప్ వేరియంట్ (8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్) ధర రూ.32,999. వీటిని ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్‍సైట్‍లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఫ్లిప్‍కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్‌లలో కూడా తీసుకోవచ్చు.

(ఇదీ చదవండి: భయం గుప్పెట్లో ఉద్యోగులు.. నీటి బుడగలా ఉద్యోగాలు: భారత్‌లోనూ..)

శాంసంగ్‌ గెలాక్సీ ఏ54 5జీ 6.4 ఇంచెస్ డిస్‍ప్లే కలిగి వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు పొందుతుంది. అదే సమయంలో ఏ34 5జీ మోడల్ 6.6 ఇంచెస్ డిస్‍ప్లే కలిగి, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు పొందుతుంది.

(ఇదీ చదవండి: ఇది కదా సక్సెస్ అంటే: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!)

కంపెనీ ఈ లేటెస్ట్ మొబైల్స్ కొనుగోలు మీద ఆఫర్స్ కూడా అందిస్తోంది, ఇందులో భాగంగానే శాంసంగ్‌ వెబ్‍సైట్‍లో కొనుగోలు చేస్తే రూ.1000 వోచర్, ICICI క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. అంతే కాకుండా సుమారు రూ. 5,999 విలువైన గెలాక్సీ బడ్స్ లైవ్ టీడబ్ల్యూఎస్‍ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్స్ అన్నీ కూడా కేవలం ఈ రోజు అర్ధరాత్రి (మార్చి 24) వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)