Breaking News

ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?

Published on Mon, 11/24/2025 - 10:13

కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్‌ కోడ్‌లను (New Labour Code) అమల్లోకి తెచ్చింది. దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రధానంగా 29 కార్మిక చట్టాలు ఉండగా వాటిని నాలుగు కొత్త లేబర్‌ కోడ్‌లుగా ఏకీకృతం చేసింది. వీటితో వేతనాల (Wages) నిర్వచనం పూర్తిగా మారిపోనుంది. ఈ నేపథ్యంలో వేతన నిర్మాణం ఎలా మారుతుంది? చేతికందే జీతం (టేక్-హోమ్) తగ్గుతుందా? అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి.

ఎక్కువ బేసిక్‌ పే..  తక్కువ టేక్‌ హోమ్‌
వేతనాలలో కనీసం 50 శాతం భాగం ప్రాథమిక వేతనం + కరువు భత్యం (డీఏ) + నిలుపుదల భత్యం (రిటైనింగ్‌ అలవెన్స్‌) రూపంలో ఉండాలనే  కొత్త నిబంధన ప్రధాన ఆందోళనగా నిలుస్తోంది. ఇప్పటి వరకు చాలా కంపెనీలు ప్రాథమిక జీతాన్ని మొత్తం సీటీసీ (CTC)లో తక్కువగా ఉంచి, మిగతాది వివిధ భత్యాలతో పూరించేవి. ఎందుకంటే పీఎఫ్‌ (ఉద్యోగి 12%, యజమాన్యం 12%), గ్రాట్యుటీ లెక్కింపు ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉండటం వల్ల, తక్కువ బేసిక్‌ పే ఉంటే తక్కువ చట్టబద్ధ తగ్గింపులు (కటింగ్స్‌) పోయి ఎక్కువ జీతం చేతికందేది.

రిటైనింగ్ అలవెన్స్ అంటే..
రిటైనింగ్ అలవెన్స్ అనేది పని లభ్యం కాని కాలాల్లో ఉద్యోగులు సంస్థను వీడి  వెళ్లకుండా నిలుపుకోవడం కోసం చేసే చెల్లింపు. దీని ద్వారా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు వారు కంపెనీతో ఉండేలా యాజమాన్యాలు చూసుకుంటాయి. 

అయితే కొత్త లేబర్‌ కోడ్‌లు వేతనాలకు ఒక నూతన ఏకీకృత నిర్వచనాన్ని తీసుకొస్తున్నాయి. మొత్తం వేతనంలో 50 శాతాన్ని మినహాయింపుల క​సం కనీస వేతనంగా పరిగణిస్తుండటంతో ఈపీఎఫ్‌, గ్రాట్యుటీ లెక్కింపునకు ఉపయోగించే బేస్ పెరుగుతుంది. అహ్లావాట్‌& అసోసియేట్స్‌కు చెందిన అలయ్ రజ్వీ ప్రకారం.. ఇది ఉద్యోగి పొందే రిటైర్మెంట్, ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల లెక్కింపులో మార్పుని తీసుకువస్తుంది.

ఇదీ చదవండి: ఉద్యోగుల గ్రాట్యుటీకి ఇక ఏడాది చాలు..

అయితే యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రాథమిక వేతనాన్ని పెంచాల్సిన అవసరం లేదని, మారేది పీఎఫ్‌/గ్రాట్యుటీ లెక్కింపు కోసం ఉపయోగించే మొత్తం మాత్రమేనని రజ్వీ స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల మినహాయింపుల బేస్ పెరుగుతుందనీ, కానీ టేక్-హోమ్ పై ప్రభావం యాజమాన్యాలు జీత నిర్మాణాన్ని ఎలా పునర్నిర్మిస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)