Breaking News

ఇళ్లు..పెళ్లిళ్లూ ఒకేసారి! సొంతింటికి కొత్త దారి!!

Published on Mon, 02/09/2026 - 12:56

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అనేది సామెత. అక్షర సత్యం కూడా. ఈరోజుల్లో ఇల్లు కట్టాలన్నా.. పెళ్లి చేసుకోవాలన్నా మాటలు కాదు.. రూ.లక్షలు.. కోట్లు కావాలి. సగటు వేతన జీవి, మధ్య తరగతి వ్యక్తికి సొంతిల్లు జీవితకాల కల. అయితే ఈ జంట కొత్త జీవితంలోకి.. కొత్త ఇంట్లోకి ఒకేసారి అడుగు పెట్టే కొత్త మార్గాన్ని చూపించారు.

ఆడంబరం కంటే ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత
ఇంటర్నేషనల్‌ డెస్టినేషన్‌లు, డిజైనర్ దుస్తులు, రోజుల తరబడి జరిగే వేడుకలతో ‘బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్’ ట్రెండ్ ఊపందుకుంటున్న వేళ ఈ జంట మాత్రం దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను ఎంచుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.

ఖరీదైన వివాహ వేడుకకు బదులుగా, పెళ్లి కోసం పొదుపు చేసిన మొత్తాన్ని తమ మొదటి ఇంటి కొనుగోలుకు ఉపయోగించినట్లు తెలిపింది. అంతేకాదు, ఆ కొత్త ఇంట్లోనే సాంప్రదాయబద్ధంగా నిరాడంబరంగా వివాహం చేసుకుని జీవితానికి అర్థవంతమైన ఆరంభం ఇచ్చిందా జంట. పెరుగుతున్న పెళ్లి ఖర్చులు స్థిరంగా లేవని భావించిన ఈ జంట, తాత్కాలిక వేడుకకన్నా దీర్ఘకాలిక ఆస్తినే ప్రాధాన్యంగా చూసింది.

సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిసింది. “భవిష్యత్తుకు సరైన ఉదాహరణ”, “తెలివైన జంట”, “జీవితానికి అద్భుతమైన ఆరంభం” అంటూ నెటిజన్లు అభినందనలు తెలిపారు. “మా కుటుంబాలు కూడా ఇలా ఆలోచిస్తే బాగుంటుంది” అన్న వ్యాఖ్యలు కూడా కనిపించాయి. అయితే కొందరు సంప్రదాయవాదులు మాత్రం “పెళ్లి జీవితంలో ఒక్కసారే వచ్చే సందర్భం” అంటూ ఘనంగా జరపాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

హోమ్ లోన్ ప్లానింగ్‌తో సాధ్యమైన సొంతిల్లు
సాధారణంగా ఇంటి కొనుగోలులో బ్యాంకులు 75–80 శాతం వరకు హోమ్ లోన్ ఇస్తాయి. మిగతా 20–25 శాతం డౌన్ పేమెంట్‌ను కొనుగోలుదారులు చెల్లించాలి. ఈ డౌన్ పేమెంట్‌నే చాలా మంది యువ జంటలకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఈ జంట మాత్రం పెళ్లి కోసం దాచుకున్న లక్షల రూపాయలను డౌన్ పేమెంట్‌గా ఉపయోగించి, హోమ్ లోన్ భారం తగ్గించుకున్నారు.

అద్దెకు బదులు ఈఎంఐ
పెళ్లి అనంతరం అద్దె ఇంట్లో ఉండటం బదులు, నేరుగా సొంతింట్లోకి మారడం ద్వారా ఈ జంట నెలవారీ అద్దెను ఈఎంఐ (EMI)గా మార్చుకుంది. రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం.. మెట్రో నగరాలు, టయర్-2 పట్టణాల్లో అద్దె, ఈఎంఐ మధ్య తేడా క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో అద్దెకు వెళ్లే డబ్బు ఆస్తి సృష్టికి ఉపయోగపడుతుంది. దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ విలువ పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం, భద్రత లభిస్తుంది.

ఇది చదివారా? శంషాబాద్‌కు కొత్త ఫేమ్‌.. ఇక మరో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌!

పెళ్లి వర్సెస్ ప్రాపర్టీ.. కొత్త ట్రెండ్!
ఖరీదైన వివాహాలు కొన్ని రోజుల్లో ముగిసిపోయే ఖర్చులు మాత్రమే. కానీ అదే డబ్బుతో కొన్న ఇల్లు జీవితాంతం ఉపయోగపడే ఆస్తిగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తుకు భద్రత, ఆర్థిక స్థిరత్వానికి పునాదిగా ఉంటుందనే కోణంలో యువత ఆలోచిస్తోంది. ఈ జంట నిర్ణయం అదే ఆలోచనకు ఉదాహరణగా మారింది. జెన్‌ జెడ్‌, మిలీనియల్స్‌లో తిరిగిరాని పెళ్లి ఖర్చులపై చర్చ పెరుగుతోంది.

పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, హోమ్ లోన్ వడ్డీలు, జీవన వ్యయం నేపథ్యంలో మైక్రో వెడ్డింగ్స్, కోర్టు మ్యారేజ్‌లు, పెళ్లి + ఇల్లు ప్లానింగ్ వంటి ట్రెండ్స్ ఊపందుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా  పెళ్లి ఖర్చులను డౌన్ పేమెంట్‌గా మార్చుకోవడం యువ జంటలకు సరైన ఫైనాన్షియల్ స్ట్రాటజీగా అభిప్రాయపడుతున్నారు.

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)