Breaking News

హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్.. ఐలైన్ స్టూడియో ప్రారంభం

Published on Thu, 03/12/2026 - 18:13

యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

ఓ వైపు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే... మరోవైపు స్కిల్లింగ్, రీ – స్కిల్లింగ్, అప్ – స్కిల్లింగ్ పై దృష్టి సారించిందన్నారు. గురువారం హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ కు నెట్ ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్ లో ‘తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌లో నగరం ఓ నిర్ణయాత్మక కేంద్రంగా  మారుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అడ్వాన్స్డ్ టూల్స్, ఇన్నోవేషన్-లెడ్ వర్క్ ఫ్లో ఇక్కడి ఎకో సిస్టంలో భాగమవుతాయని, ఇక్కడి యువతకు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ లభిస్తాయన్నారు.

పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులను కోరారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)