Breaking News

పొదుపు, పెట్టుబడులకే తొలి ప్రాధాన్యం

Published on Fri, 09/12/2025 - 14:34

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున మినహాయింపులతో కొత్త పన్ను విధానం అమల్లోకి రాగా, అధిక వేతనం ఆర్జించే వారికి గణనీయంగా పన్ను ఆదా కానుంది. ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులకు మళ్లిస్తామని 57 శాతం మంది ఉద్యోగులు నౌకరీ నిర్వహించిన సర్వేలో తెలిపారు. విచక్షణారహిత వ్యయాలకు బదులు పెట్టుబడులకు, రుణాల తిరిగి చెల్లింపులకు ఆదా అయ్యే మొత్తాన్ని వెచ్చిస్తామని నిపుణులు చెప్పారు. రూ.12.75 లక్షల వరకు ఆర్జించే 20వేల మంది నిపుణుల అభిప్రాయాలను నౌకరీ సర్వేలో భాగంగా తెలుసుకుంది.  

  • కొత్త పన్ను విధానంలో కల్పించిన పన్ను ప్రయోజనాల గురించి తెలుసనని 64 శాతం మంది చెప్పగా, 43 శాతం మంది తమకు దీనిపై స్పష్టత లేదనో, అసలు తెలియదనో చెప్పడం గమనార్హం.

  • పన్ను మినహాయింపుల కారణంగా మిగిలే మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లిస్తామని 57 శాతం మంది వెల్లడించారు. రుణాల చెల్లింపులకు వినియోగిస్తామని 30 శాతం మంది తెలిపారు.

  • 9 శాతం మంది మెరుగైన జీవనం కోసం ఖర్చు చేస్తామని, 4 శాతం మంది ప్రయాణాలు, విహార యాత్రల కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.  

  • ఢిల్లీ, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో అత్యధికంగా 63–64 శాతం మంది నిపుణులు మిగులు ఆదాయాన్ని పక్కన పెడతామని తెలిపారు.  

  • చెన్నైలో 44 శాతం నిపుణులు రుణ చెల్లింపులకు వినియోగిస్తామని చెప్పగా, ముంబైలో 51 శాతం మంది రిటైర్మెంట్‌ అవసరాలకు మళ్లిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: గ్లోబల్‌ కంపెనీలకు కేంద్రం స్వాగతం

Videos

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

'మిరాయ్’ మూవీ రివ్యూ

చంద్రబాబుకి ఆ రెండంటే గుర్తొచ్చేది వ్యాపారమే

Haryana: కానిస్టేబుల్ ను గంట జైల్లో పెట్టిన కోర్టు

Garam Garam Varthalu: ‪120 ఏళ్లు.. హ్యాపీ బర్త్‌ డే బామ్మ

Photos

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)

+5

మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)