Breaking News

కొత్త ఉద్యోగాలు పెరగనున్నాయ్.. ఇదిగో సాక్ష్యం!

Published on Tue, 08/22/2023 - 12:14

కరోనా వైరస్ కారణంగా చాలా కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్తగా ఉద్యోగులను చేర్చుకోవడం లేదా ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ చేయడం గానీ పూర్తిగా ఆపేసాయి. అంతే కాకుండా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించగా.. మరికొన్ని సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ వెసలుబాటు కల్పించి ఇంటికే పరిమితం చేశాయి. కాగా ఇప్పుడు ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు.. నియామకాల జోరు కూడా పెరుగుతోంది.

నివేదికల ప్రకారం, 2023 డిసెంబర్ చివరి నాటికి కొత్త ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని, ఇప్పటికే ఖాళీ ఉన్న పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయడానికి కంపెనీలు సన్నద్ధమవుతాయని తెలుస్తోంది. నౌకరి హైరింగ్ అవుట్ లుక్ (Naukri Hiring Outlook) రూపొందించిన ఒక నివేదికలో 1200ల కంటే ఎక్కువ నియామక సంస్థలు, కన్సల్టెంట్స్ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: భారత్ ఎన్‌సీఏపీ ప్రారంభం నేడే.. దీనివల్ల ఉపయోగాలెన్నో తెలుసా?

రానున్న రోజుల్లో దాదాపు 92 శాతం నియామకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇందులో కూడా కొత్త ఉద్యోగాల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ వంటి వాటిలో ఉద్యోగాలు మెండుగా ఉండనున్నాయి.

ఈ ఏడాది చాలా సంస్థలు తమ ఉద్యోగులకు చాలా తక్కువ మొత్తంలో ఇంక్రిమెంట్స్ కల్పించాయి, కాగా మరికొన్ని కంపెనీలు ఇంక్రిమెంట్ ఊసే ఎత్తలేదు. అంతే కాకుండా చాలా రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటుపడిన ఉద్యోగులను తప్పకుండా ఆఫీసులకు రావాలని బడా సంస్థలు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఇవన్నీ కూడా కొత్త ఉద్యోగాలు కల్పించడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)