అమెరికా సీఈవో ఫోరంపై నాస్కామ్‌ కసరత్తు

Published on Sat, 07/05/2025 - 11:05

భారత్, అమెరికా టెక్‌ దిగ్గజాలు కలిసి పని చేసేలా ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ వెల్లడించింది. జూలై 9న అమెరికా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ కార్యాలయంలో యూఎస్‌ సీఈవో ఫోరంను ప్రారంభించనున్నట్లు వివరించింది.

కొత్త ఆవిష్కరణలు, పాలసీలు, నిపుణులను తయారు చేసుకోవడం వంటి అంశాలపై అత్యున్నత స్థాయి లో సంప్రదింపులు నిర్వహించేందుకు ఇది తోడ్పడుతుందని నాస్కామ్‌ పేర్కొంది. ప్రవాస భారతీయులు, ప్రభుత్వం, పరిశ్రమ, ఇన్వెస్ట్‌మెంట్, మేధావులు, విద్యావేత్తలు మొదలైన వర్గాలను సమన్వయపర్చడం ద్వారా భారత్‌–అమెరికా టెక్‌ భాగస్వామ్యాన్ని పటిష్టపర్చేందుకు సహాయకరంగా ఉంటుందని తెలిపింది.

భారతీయ టెక్నాలజీ కంపెనీలు అమెరికా అంతటా డిజిటల్ పరివర్తనను శక్తివంతం చేయడమే కాకుండా, ఉద్యోగాలను సృష్టించడం, స్థానిక కమ్యూనిటీలలో పెట్టుబడులు పెట్టడం, నిజమైన ప్రభావాన్ని అందించే ఆవిష్కరణలను నడిపిస్తున్నాయని నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్ అన్నారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ సీఈఓ అమిత్ చద్దా, విప్రోలో అమెరికాస్ వన్ సీఈఓ మలయ్ జోషితో పాటు నంబియార్ ఈ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొంటారని నాస్కామ్ తెలిపింది.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)