Breaking News

ఇన్ఫోసిస్ డివిడెండ్.. 17 నెలల బుడ్డోడికి రూ. 3.3 కోట్లు

Published on Fri, 04/18/2025 - 09:36

దేశంలో అగ్రగామి ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌ల నుంచి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఎకాగ్రహ్ రోహన్ మూర్తి రూ. 3.3 కోట్లు అందుకోనున్నాడు. ఈ బుడ్డోడికి ఇన్ఫోసిస్‌లో 15 లక్షల షేర్లు (0.04% వాటా) ఉన్నాయి. ఎకాగ్రహ్ నాలుగు నెలల వయసున్నప్పుడు  నారాయణ మూర్తి బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో ఈ షేర్ల విలువ రూ. 240 కోట్లకు పైగా ఉండేది.

ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో షేరుకు రూ. 22 డివిడెండ్‌ను ప్రకటించింది. దీని ద్వారా ఎకాగ్రహ్‌కు రూ. 3.3 కోట్ల డివిడెండ్ లభించనుంది. ఈ చిన్నారి ఇప్పటివరకు మొత్తం రూ. 10.65 కోట్ల డివిడెండ్‌ను సంపాదించాడు. చిన్న వయసులోనే ఎకాగ్రహ్‌కు రూ.కోట్లలో ఆదాయం లభించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇన్ఫోసిస్, భారత ఐటీ రంగంలో అగ్రగామిగా ఉంటూ, తన వాటాదారులకు స్థిరమైన డివిడెండ్‌లను అందిస్తోంది. నారాయణ మూర్తి తన మనవడికి ఇచ్చిన ఈ బహుమతి, ఎకాగ్రహ్ భవిష్యత్తును ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, కుటుంబ ఆస్తుల పంపిణీలో ఒక ఉదాహరణగా నిలుస్తోంది.  రాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమారుడు రోహన్‌ మూర్తి, అపర్ణా కృష్ణన్‌ల ముద్దుల కొడుకే ఈ ఎకాగ్రహ్.

ఇక నారాయణ మూర్తి కుమార్తె, యూకే మాజీ ప్రధాని సతీమణి అక్షతా మూర్తికి ఇన్ఫోసస్‌లో 3.89 లక్షల షేర్లు (1.04% వాటా) ఉన్నాయి. దీంతో ఆమె రూ.85.71 కోట్లు అందుకోబోతున్నారు. అలాగే నారాయణ మూర్తి రూ.93.33 కోట్లు, ఆయన భార్య సుధా మూర్తి రూ.76 కోట్లు ఈ డివిడెండ్‌ల ద్వారా ఆర్జించనున్నారు. ఈ డివిడెండ్‌లకు మే 30వ తేదీని రికార్డ్‌ డేట్‌గా ప్రకటించగా జూన్‌ 30న ఆయా మొత్తాలు వాటాదారుల చేతికి అందనున్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)