Breaking News

ఒకే కుటుంబానికి రెండు రోజుల్లో రూ.6,875 కోట్ల నష్టం

Published on Wed, 03/12/2025 - 13:35

ఇన్ఫోసిస్ లిమిటెడ్ షేర్‌ ధర వరుసగా రెండు రోజుల నుంచి భారీగా పతనమవుతోంది. దాంతో కంపెనీ షేర్‌ హోల్డర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అందులో మేజర్‌ వాటాదారులుగా ఉన్న కంపెనీ ప్రమోటర్ నారాయణమూర్తి, ఆయన కుటుంబ సభ్యులకు గణనీయంగా నష్టాలు నమోదయ్యాయి. బుధవారం ఇన్ఫోసిస్ 5.49 శాతం క్షీణించి 1,569.35 వద్ద కనిష్టాన్ని తాకింది. 2024 డిసెంబర్‌లో 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,006.80తో పోలిస్తే ఈ షేరు దాదాపు 22 శాతం క్షీణించింది. దాంతో మూర్తి కుబుంబానికి ఏకంగా రెండు రోజుల్లో రూ.6,875 కోట్లు నష్టం వాటిల్లింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ వార్ కారణంగా ఐటీ కంపెనీల క్లయింట్లు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. దాంతో కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఇన్ఫోసిస్‌ స్టాక్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో తాజా పతనం సంభవించిందని చెబుతున్నారు. కేవలం ఐటీ స్టాక్‌లే కాకుండా దాదాపు చాలా స్టాక్‌లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

ఇదీ చదవండి: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్‌!

ఎవరి వాటా ఎంత..

కార్పొరేట్ డేటాబేస్ ఏసీఈక్విటీతో సేకరించిన డేటా ప్రకారం ఎన్ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇన్ఫోసిస్‌లో రూ.26,287.19 కోట్ల విలువైన 4.02 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2024 డిసెంబర్ 13న రూ.33,162.89 కోట్లతో పోలిస్తే ఇది ఇటీవల రూ.6,875.70 కోట్లు తగ్గింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ మూర్తి ఇన్ఫోసిస్‌లో 0.40 శాతం వాటాను కలిగి ఉండగా, ఆయన భార్య సుధా మూర్తి డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి 0.92 శాతం వాటాను కలిగి ఉన్నారు. దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌గా పేరున్న ఇన్ఫోసిస్‌లో వారి కుమారుడు రోహన్ మూర్తి, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ భార్య, నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తికి వరుసగా 1.62 శాతం, 1.04 శాతం వాటాలు ఉన్నాయి. మూర్తి మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి ఇన్ఫోసిస్‌లో స్వల్పంగా 0.04 శాతం వాటా ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)