Breaking News

‘ఒక్క క్లిక్‌తో బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం’

Published on Tue, 09/16/2025 - 15:05

సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్న టెక్నాలజీలను ఆసరాగా తీసుకుని సైబర్‌ నేరస్థులు సామాన్య ప్రజలను టార్గెట్‌ చేసే వీలుందని ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ తన ఎక్స్‌ ఖాతా వేదికగా హెచ్చరించారు. ఇటీవల జెమిని నానో బనానా మోడల్ వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈమేరకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

నానో బనానా

గూగుల్ గత నెలలో జెమిని యాప్‌కు ‘నానో బనానా’ సంబంధించిన ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్‌ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్‌ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను సృష్టించింది. వేగం, కచ్చితత్వంలో ఇది చాట్‌జీపీటీ, మిడ్‌జర్నీ వంటి ప్రత్యర్థులకంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

సారీ ట్రెండ్‌..

సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం నానో బనానా 5 ప్రాంప్ట్‌లలో అందుబాటులో ఉంది. తాజాగా బనానా మోడల్‌ తరహాలోనే ‘సారీ ట్రెండ్‌’ కూడా వైరల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ట్రెండింగ్‌ టెక్నాలజీలను ఉపయోగించుకుని సామాన్య ప్రజలపై మోసాలకు ఒడిగట్టే అవకాశం ఉంటుందని, వెబ్‌సైట​్‌ల్లో ఫొటోలు అప్‌లోడ్‌ చేసేముందు జాగ్రత్త వహించాలని సజ్జనార్‌ చెప్పారు.

నకిలీ వెబ్‌సైట్లు.. అనధికార యాప్‌లు..

‘ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ టాపిక్‌లతో జాగ్రత్తగా ఉండండి! నానో బనానా ట్రెండింగ్ క్రేజ్ ఉచ్చులోపడి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకుంటే, సైబర్‌ మోసాలు జరగడం ఖాయం. కేవలం ఒక్క క్లిక్‌తో మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నేరస్థుల చేతుల్లోకి చేరుతుంది. ఫొటోలు లేదా వ్యక్తిగత వివరాలను నకిలీ వెబ్‌సైట్లు లేదా అనధికార యాప్‌ల్లో ఎప్పుడూ పంచుకోవద్దు. మీ ఫొటోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అప్‌లోడ్‌ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి’ అని సజ్జనార్ ఎక్స్‌తో చెప్పారు.

ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)