Breaking News

మస్క్‌ VS టెస్లా ఉద్యోగులు

Published on Thu, 09/19/2024 - 11:09

అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌.. తన ఈవీ కంపెనీ టెస్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు పరస్పరం విరుద్ధంగా మారారు.  రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు మస్క్‌ మద్దతు ఇస్తుండగా టెస్లా ఉద్యోగులు మాత్రం డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలహారిస్‌ వైపు నిలుస్తున్నారు.

అధ్యక్ష రేసులో పాల్గొంటున్న అభ్యర్థులకు ప్రచారం నిమిత్తం ఇస్తున్న విరాళాల ద్వారా టెస్లా ఉద్యోగుల మొగ్గు ఎటువైపు అన్నది తెలుస్తోంది. టెస్లా ఉద్యోగులు ట్రంప్‌ కంటే దాదాపు రెట్టింపు విరాళాలను కమలాహారిస్‌కు ఇస్తున్నట్లు తెలిసింది. యూఎస్‌ ప్రచార సహకారాలు, లాబీయింగ్ డేటాను ట్రాక్ చేసే ఓపెన్‌ సీక్రెట్‌ అనే సంస్థ ప్రకారం.. టెస్లా ఉద్యోగులు కమలకు 42,824 డాలర్లు విరాళం అందించగా ట్రంప్‌నకు 24,840 డాలర్ల విరాళం అందించారు.

ఎక్స్‌, స్పేస్‌ఎక్స్‌ ఉద్యోగులు కూడా..
ఎలాన్‌ మస్క్‌కు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ ఉద్యోగులు కూడా డెమోక్రాటిక్‌ అభ్యర్థి కమలహారిస్‌కే మద్దతిస్తున్నారు. వీరు కమలహారిస్‌కు 34,526 డాలర్లు విరాళం అందించగా ట్రంప్‌నకు ఇచ్చింది కేవలం 7,652 డాలర్లు. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఉద్యోగులు సైతం హారిస్‌కు 13,213 డాలర్లు విరాళమిచ్చారు. ట్రంప్‌కు ఇచ్చింది 500 డాలర్ల కంటే తక్కువ కావడం గమనార్హం.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)