నిద్రపోయి.. రూ.9.6 లక్షలు గెలిచిన యువతి!

Published on Sat, 11/07/2026 - 13:09

సాధారణంగా డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి, లేదా రోజంతా కష్టపడాలి. కానీ.. ఓ యువతి మాత్రం నిద్రపోతూనే లక్షల రూపాయలు సంపాదించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.

ముంబైకి చెందిన జినియా ఛటర్జీ అనే యువతి రెండు నెలల పాటు జరిగిన ఓ ప్రత్యేక పోటీలో పాల్గొని ఏకంగా రూ.9.6 లక్షల బహుమతిని గెలుచుకుంది. అంతేకాదు.. ఉచితంగా వెకేషన్ వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. వేక్‌ఫిట్ (Wakefit) నిర్వహించిన ఈ స్లీప్ ఇంటర్న్‌షిప్‌లో దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, చివరకు జినియా విజేతగా నిలిచింది.

10 మందికి అవకాశం
ఈ పోటీలో పాల్గొనేవారు రోజూ సరైన సమయానికి నిద్రపోవాలి. నిద్ర విషయంలో క్రమశిక్షణ పాటించడంతో పాటు, వారానికి ఒకసారి ఇచ్చే కొన్ని సరదా టాస్కులను కూడా పూర్తి చేయాలి. దేశవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల నుంచి పలు దశల్లో ఎంపిక చేసి కేవలం 10 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. దాదాపు 60 రోజుల పాటు జరిగిన ఈ పోటీలో ఎవరు ఎంతసేపు నిద్రపోయారు, వారి నిద్ర నాణ్యత ఎలా ఉందనే విషయాలను పరిశీలించి రోజువారీ స్కోర్లు ఇచ్చారు.

అయితే.. ఈ పోటీలో కేవలం నిద్రపోవడమే కాదు.. కొన్ని వెరైటీ టాస్కులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 'స్లీప్ సినిమా' ఛాలెంజ్‌లో ప్రముఖ సినిమాల్లోని సన్నివేశాలను నిద్రకు సంబంధించిన అంశాలతో మళ్లీ రూపొందించాలి. మరో టాస్క్‌లో వారం రోజుల పాటు తమ నిద్ర అలవాట్లను గమనించాలి. ఇక అండర్‌కవర్ స్లీప్ మిషన్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారికి అనుమానం రాకుండా బ్లాంకెట్, పిల్లో అనే పదాలను పదిసార్లు ఉపయోగించాలి. ఇలా ప్రతి వారం టాస్కుల్లో మంచి ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక టైటిల్స్ ఇచ్చేవారు.

టాస్కులు కూడా..
రెండు నెలల తర్వాత జినియా ఛటర్జీ, రత్నగిరి మణికందన్, మెహెక్ ఖోట్ టాప్-3లో నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన కరీం ఖాన్ కూడా వారపు టాస్కుల్లో అత్యధిక విజయాలు సాధించి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఫైనల్‌కు చేరుకున్నాడు. చివరగా నలుగురి మధ్య బిగ్ బెడ్ పేరుతో ఫైనల్ పోటీ నిర్వహించారు. ఇందులో బెడ్‌రూమ్ సెటప్‌ను గుర్తించి మళ్లీ ఏర్పాటు చేయడం, దిండ్లు, దుప్పట్లు, ఏసీ, లైటింగ్, సౌండ్ వంటి సౌకర్యాలను వేలం ద్వారా ఎంచుకోవడం వంటి టాస్కులు ఇచ్చారు.

చివరగా పోటీదారులు తమకు నచ్చిన నిద్ర వాతావరణంలో ఒక రాత్రి గడిపారు. వారి నిద్ర స్కోర్ల ఆధారంగా జినియా ఛటర్జీ విజేతగా నిలిచింది. దీంతో ఆమెకు రూ.9.6 లక్షల నగదు బహుమతితో పాటు వేక్‌ఫిట్ స్పాన్సర్ చేసిన వెకేషన్ కూడా లభించింది. కాగా, 2019లో ప్రారంభమైన ఈ స్లీప్ ఇంటర్న్‌షిప్‌కు ఇప్పటివరకు నాలుగు సీజన్లలో 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 65 మంది ఇంటర్న్‌లు ఒక్కొక్కరు రూ.లక్ష స్టైపెండ్ అందుకున్నారు. ఇప్పుడు ఆరో సీజన్ కోసం కూడా ప్రీ-రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

ఇదీ చదవండి: పసిడి ధరలలో మార్పు.. పండక్కి ముందే కొత్త రేట్లు ఇలా..

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)