Breaking News

కళ్లు తిరిగేలా.. దేశంలో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదో తెలుసా?

Published on Tue, 05/16/2023 - 07:39

న్యూఢిల్లీ: ఖరీదైన నివాస గృహాల ధరల పెరుగుదలలో అంతర్జాతీయంగా ముంబై నగరం 6వ స్థానంలో నిలిచినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది. 2023 సంవత్సరం మొదటి మూడు నెలల కాలానికి సంబంధించి ఈ సంస్థ ‘ప్రైమ్‌ గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ క్యూ1, 2023’ను విడుదల చేసింది. 

ఈ కాలంలో ముంబైలో ఖరీదైన ఇళ్ల ధరలు 5.5 శాతం పెరిగాయి. అలాగే, బెంగళూరు, న్యూఢిల్లీలోనూ సగటున ధరలు పెరిగాయి. ఖరీదైన ఇళ్ల ధరల పెరుగుదల పరంగా 2022 మొదటి త్రైమాసికం జాబితాలో ముంబై 38వ ర్యాంకులో ఉండగా, ఏడాది తిరిగేసరికి 6వ స్థానానికి చేరుకున్నట్టు నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో గతేడాది ఇదే కాలంలో 37వ ర్యాంకులో ఉన్న బెంగళూరు తాజా జాబితాలో 16కు, న్యూఢిల్లీ 39 నుంచి 22వ ర్యాంకుకు చేరుకున్నాయి.

‘‘ముంబైలో ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు 5.5 శాతం పెరగ్గా, బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం పెరిగాయి. న్యూఢిల్లీలో ఈ పెరుగుదల 1.2 శాతంగా ఉంది’’అని నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 46 పట్టణాల్లో ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరల పెరుగుదల ఆధారంగా వాటికి ర్యాంకులకు కేటాయిస్తుంటుంది. స్థానిక కరెన్సీలో సాధారణ ధరలను ప్రామాణికంగా తీసుకుంటుంది.

ముంబైలో ఇళ్లకు డిమాండ్‌ గణనీయంగా పెరగడమే సూచీలో మెరుగైన ర్యాంకుకు తీసుకెళ్లినట్టు నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. ముంబై ఇళ్ల మార్కెట్లో అన్ని విభాగాల్లోనూ డిమాండ్‌ బలంగానే ఉందని, ఖరీదైన ఇళ్ల ధరలు ఎక్కువగా పెరిగినట్టు తెలిపింది. అంతర్జాతీయంగా దుబాయిలో ఖరీదైన ఇళ్ల ధరలు 44.2 శాతం పెరగడంతో, ఈ నగరం మొదటి స్థానంలో నిలిచింది.

చదవండి👉 సొంతిల్లు కొంటున్నారా?, అదిరిపోయే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)