Breaking News

1 BHK రూ.70 వేలు! ఇది రెంటా లేక ఈఎంఐనా? పోస్ట్‌ వైరల్‌

Published on Wed, 06/12/2024 - 19:50

అత్యంత రద్దీ నగరమైన ముంబై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖరీదైన ఇక్కడి హౌసింగ్ మార్కెట్ నివాసితులకు ఒక ప్రధాన సవాలుగా కొనసాగుతోంది. పెరుగుతున్న ధరలతో అందుబాటు అద్దెలో ఇళ్లు దొరకడం కష్టంగా మారింది. ఇటీవల విటా అనే ఒక లాయర్ ‘ఎక్స్’ (ట్విటర్‌)లో చేసిన పోస్ట్ విపరీతమైన ఖర్చులను ఎత్తిచూపడంతో పాటు ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీసింది.

ముంబైలోని ప్రధాన ప్రాంతాల్లో 1 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల అద్దె నెలకు రూ.50,000 నుంచి రూ.70,000 వరకు ఉంటోందని విటా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. విడిగా ఉండేందుకు బయటకు వెళ్లకుండా తమ జీవన ఏర్పాట్లను పునఃపరిశీలించుకోవాలని, కుటుంబ సభ్యులతో కలిసి నివసించాలని తోటి యూజర్లకు ఆమె సూచించారు. "ముంబైలో 1 బీహెచ్‌కే అద్దె రూ.50,000-70,000 ఉంటోంది. మీ అమ్మానాన్నలతో మంచి సంబంధాలు పెట్టుకోండి. స్వతంత్రంగా ఉండటానికి ఇంటి నుంచి బయటకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు" అని ఆమె రాసుకొచ్చారు.

ఈ ట్వీట్ వెంటనే వైరల్ గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. ముంబైలో అధిక జీవన వ్యయం నుంచి పలువురు యూజర్లు తమ సొంత అనుభవాలను పంచుకున్నారు. అప్పుల భారం లేకుండా ఇల్లు, మంచి వైద్యం, నాణ్యమైన విద్య పొందడం చాలా మందికి అసాధ్యమైన కలలా కనిపిస్తోందంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. 'ఇది 70 వేల అద్దె లేదా ఈఎంఐనా?' అని ప్రశ్నిస్తూ మరో యూజర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  "నేను ఈ నగరం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను. ఈ అద్దెను నేను భరించలేను" అంటూ ఇంకొక యూజర్ అసహనాన్ని వ్యక్తం చేశారు.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)