Breaking News

దేశంలో మొదటి భూగర్భ మెట్రో.. వచ్చే నెల నుంచే..

Published on Wed, 06/26/2024 - 21:56

ఎంతగానో ఎదురు చూస్తున్న దేశంలో మొట్టమొదటి అండర్‌గ్రౌండ్‌ మెట్రో లైన్‌ ముంబైలో వచ్చే నెలలో ప్రారంభం కానుంది. పూర్తి భూగర్భ కారిడార్ అయిన కొలాబా-బాంద్రా-ఎస్ఈఈపీజెడ్ మెట్రో లైన్ 3 ప్రారంభంతో ముంబై వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.

ముంబై నగరంలోని ఆరే కాలనీని ప్రధాన వ్యాపార జిల్లా అయిన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బికెసి) తో కలిపే మెట్రో లైన్ ఫేజ్‌ 1ను  జులైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరే కాలనీ నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకు సుమారు 9.63 కిలోమీటర్ల దూరాన్ని ఫేజ్‌ 1 కవర్ చేస్తుంది.

మెట్రో లైన్ 3 నిర్మాణం మొత్తం పూర్తయితే 33.5 కిలోమీటర్ల మేర 27 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మెట్రోలో ప్రతిరోజూ 260 సర్వీసులు నడుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు వీటిని నడిపేలా నిర్ణయించారు.

ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌సీ) రూ.37,000 కోట్లకు పైగా వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది. కొలాబా-బాంద్రా-ఎస్ఈఈపీజెడ్ మెట్రో లైన్ 3 ఆపరేషన్, నిర్వహణ కాంట్రాక్టును ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఎంఎంఆర్‌సీ ఇచ్చింది. అంతర్జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియ అనంతరం 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఎంఎంఆర్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)