Breaking News

పెయింట్ ఖర్చు రూ. కోటి! ఆ కారు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Published on Sun, 06/25/2023 - 15:15

Rolls Royce Cullinan: భారతదేశంలో ముఖేష్ అంబానీ గురించి, వారి కుటుంబం గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉంటూ.. రిలయన్స్ గ్రూప్ వంటి బడా కంపెనీతో కోట్లు సంపాదిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నారు. అత్యంత విలాసవంతమైన భవనాల్లో నివసించడమే కాకుండా ఖరీదైన లగ్జరీ కార్లను సైతం లెక్కకు మించి కొనుగోలు చేశారు. వీరి వద్ద ఇప్పటికే మూడు రోల్స్ రాయిస్ కార్లు ఉండటం గమనార్హం. వీటి ధరలు రూ. కోట్లలో ఉన్నాయి. కాగా ఇందులో ఒక కారు పెయింట్ ఖర్చు మాత్రమే రూ. 1 కోటి వరకు ఉంటుందని చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గత సంవత్సరంలో ముఖేష్ అంబానీ మూడవ 'రోల్స్ రాయిస్ కల్లినన్‌' (Rolls Royce Cullinan) డెలివరీ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న దాదాపు అన్ని కార్లలో ఈ కారు చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. ఇది ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కలిగి ఉండటమే కాకుండా, వారికి నచ్చిన విధంగా తయారైంది. దీన్ని బట్టి చూస్తే ఇది కస్టమైజేషన్ కారు అని తెలుస్తోంది. ఈ కారు ధర ఏకంగా రూ. 13.14 కోట్లు అని నివేదికలు చెబుతున్నాయి.

మార్కెట్లో రోల్స్ రాయిస్ కల్లినన్ బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 6.8 కోట్లు. అయితే ఇది ఆప్షనల్ ఫీచర్స్ కలిగి కస్టమైజ్ పొందటం వల్ల ధర ఎక్కువ అని తెలుస్తోంది. ఇందులో తెలుసుకోవలిసిన మరో అంశం ఏమిటంటే పెయింటింగ్ స్కీమ్. ఈ కారు పెయింట్‌వర్క్‌కే రూ. 1 కోటి ఖర్చు అయినట్లు సమాచారం. 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం కూడా ఇందులో గమనించవచ్చు.

(ఇదీ చదవండి: ఇన్‌స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు! టాప్ 5 జాబితాలో ఎవరున్నారంటే?)

రిజిస్ట్రేషన్ నెంబర్
ముఖేష్ అంబానీ కల్లినన్ 0001 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉంటుంది. సాధారణ విఐపి నెంబర్ ధర రూ. 4 లక్షలు. అయితే ఈ నెంబర్ మరింత స్పెషల్ కావున దీని ధర రూ. 12 లక్షలు. అంతే కాకుండా ఈ కారు కోసం రూ. 20 లక్షలు వన్-టైమ్ టాక్స్ చెల్లించారు. ఇది 2037 వరకు చెల్లుబాటు అవుతుంది.

(ఇదీ చదవండి: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే ఒప్పో 5జీ స్మార్ట్‌ఫోన్!)

భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ బెంటాయగ, బీఎండబ్ల్యూ, ఫెరారీ మొదలైన ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)