Breaking News

బ్యాంకులో రూ.558 కోట్ల దొంగతనం!

Published on Tue, 12/17/2024 - 15:09

ఖాతాదారులకు చెందిన సేఫ్ డిపాజిట్ బాక్స్‌ల నుంచి ఒక బిలియన్ యెన్ (సుమారు 6.6 మిలియన్‌ డాలర్లు-రూ.558 కోట్లు) సొమ్మును బ్యాంకు ఉద్యోగి దొంగలించినట్లు జపాన్‌లోని ప్రముఖ బ్యాంకు మిత్సుబిషి యుఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ తెలిపింది. అందుకుగాను అధికారికంగా కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది. 60 మంది క్లయింట్‌ల్లో సుమారు 20 మంది ఖాతాల్లో నుంచే 300 మిలియన్ యెన్ (దాదాపు 2 మిలియన్‌ డాలర్లు-రూ.169 కోట్లు) వరకు దొంగతనాలు జరిగినట్లు ధృవీకరించింది. కస్టమర్లు కోల్పోయిన నగదు పరిహారం కోసం కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కొత్త సార్‌ ముందున్న సవాళ్లు!

ఎంయూఎఫ్‌జీ ప్రెసిడెంట్, సీఈఓ జునిచి హంజావా విలేకరులతో మాట్లాడుతూ..‘టోక్యోలోని మిత్సుబిషి యుఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ బ్యాంకు శాఖల్లో ఈ దొంగతనాలు జరిగాయి. ఏప్రిల్ 2020 నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు ఈమేరకు ఫ్రాడ్‌ జరిగినట్లు గుర్తించాం. సేఫ్ డిపాజిట్ బాక్స్‌లను ఓ మహిళా ఉద్యోగి నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన కీ తనవద్దే ఉంటుంది. ఆ ఉద్యోగి డబ్బు తీసుకున్నట్లు, ఇతర పెట్టుబడులు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు అంగీకరించింది. వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి విచారణ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాం. జరిగిన దొంగతనానికి క్షమాపణలు కోరుతున్నాం. నగదు నష్టపోయిన కస్టమర్లకు పరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)