Breaking News

త్వరలోనే మోటరోలా కొత్త వర్షన్‌ మడత ఫోన్లు.. ప్రకటించిన సీఈవో

Published on Thu, 03/02/2023 - 19:54

మోటరోలా కొత్త వర్షన్‌ మడత ఫోన్లు త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. ఈ  ఏడాదిలోనే మోటరోలా రేజర్‌ (Motorola Razr) ఫోల్డబుల్‌ కొత్త వర్షన్‌ ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు లెనోవో సీఈవో యువాన్‌కింగ్‌ యాంగ్‌ తెలిపారు. దశాబ్దాల క్రితం బాగా పాపులరైన మడత ఫోన్‌ మోడళ్లు ప్రస్తుత స్మార్ట్‌ ఫోన్‌ యుగంలో మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. 2000 సంవత్సరంలో మోటరోలా రేజర్‌ మడత ఫోన్‌ బాగా పాపులర్‌ అయిన ఫోన్లలో ఒకటి. మోటరోలా సంస్థను గూగుల్‌ నుంచి 2014లో లెనోవో సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

బార్సిలోనాలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా సీఎన్‌బీసీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లెనోవో సీఈవో యువాన్‌కింగ్‌ యాంగ్‌ మోటరోలా రేజర్‌ ఫోన్‌ గురించి మాట్లాడారు. కొత్త వర్షన్‌ మడత ఫోన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించిన వివరాలను ఎక్కువగా ప్రస్తావించని ఆయన ఆ ఫోన్‌లో అప్లికేషన్‌లు, ఇతర ఫీచర్లు మాత్రం అందరికీ నచ్చేలా ఉంటాయన్నారు. ఫోల్డబుల్‌ ఫోన్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తగ్గుతాయని పేర్కొన్నారు.

చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. మరో ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డ్‌!

కాగా ఈ మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో మోటరోలా తన ‘రోలబుల్’ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ప్రదర్శించింది. ఇందులో రోల్ అప్ డిస్‌ప్లే ఉంటుంది. అంటే ఫోన్‌ డిస్‌ప్లేను కింది నుంచి పైకి జరపవచ్చన్న మాట.

చదవండి: WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్‌ టాప్‌!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)