Breaking News

పెంట్‌ హౌస్‌ రూ.240 కోట్లా.. ఎక్కడో తెలుసా?

Published on Fri, 02/10/2023 - 12:06

మీరు చదుతున్నది నిజమే. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని పెంట్‌ హౌస్‌ రూ.240 కోట్లకు అమ్మడుపోయింది. ఈ అపార్ట్‌మెంట్‌ ముంబై నగరంలోని వోర్లీ ప్రాంతంలో ఉంది. వెల్సన్‌ గ్రూప్‌ చైర్మన్‌ బీకే గోయెంకా ఇంత భారీ మొత్తం చెల్లించి దీన్ని సొంతం చేసుకున్నారు. ఖరీదైన ఈ ట్విన్‌ టవర్స్‌ పేరు ‘360వెస్ట్‌’. ఇందులో 63, 64, 65  అంతస్థుల్లో ఈ పెంట్‌హౌస్‌ ఉంది. దీని విస్తీర్ణం 30వేల చదరపు అడుగులు.

నగరంలో అత్యంత విలాసవంతమైన ‘360వెస్ట్‌’ అపార్ట్‌మెంట్‌లో ట్రిపులెక్స్‌ పెంట్‌ హౌస్‌ భారీ ధరకు అమ్ముడుపోయి అత్యంత భారీ అమ్మకాల్లో ఒకటిగా నిలిచింది. ఈ భారీ డీల్‌ బుధవారం జరిగింది. ఇందులో నివసించేందుకు పారిశ్రామికవేత్త ఈ ఖరీదైన ట్రిపులెక్స్‌ పెంట్‌ హౌస్‌ను కొనుగోలు చేశారు.  అయితే పక్కగా ఉన్న మరో పెంట్‌ హౌస్‌ను బిల్డర్‌ వికాస్‌  ఒబెరాయ్‌ రూ.24 కోట్లకు కొనుగోలు  చేయడం గమనార్హం.

కాగా గత వారంలోనే ఒబెరాయ్‌ రియల్టీ సంస్థ.. ఈ విలాసమంతమైన ‘360వెస్ట్‌’ భవన సముదాయాన్ని రూ.4వేల కోట్లకు కొనుగోలు చేసినట్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌సీల్లో నమోదు చేసుకుంది. ఇందులో 63 అపార్ట్‌మెంటులు ఉన్నాయి. ల్యాండ్‌ ఏరియా 5.25 లక్షల చదరపు అడుగులు. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న సముదాయం రెండు భవంతులుగా ఉంటుంది. ఇందులో ఒకటి రెసిడెన్సియల్‌ ప్రాజెక్ట్‌ కాగా మరొకటి రిట్జ్‌-కార్ల్‌టన్‌ హోటల్‌.

(ఇదీ చదవండి: ఓలా కొత్త స్కూటర్లు వచ్చేశాయి.. ధర ఎంతో తెలుసా?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)