Breaking News

చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఓ లుక్కేసుకోండి!

Published on Fri, 08/25/2023 - 19:12

1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe: చంద్రయాన్-3 ఇటీవల చంద్రుని మీద అడుగుపెట్టి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా చరిత్రలో 'ఇండియా' పేరు సువర్ణాక్షరాలతో లికించడానికిది దోహదపడింది. అరుదైన గొప్ప రికార్డుని సొంతం చేసుకున్న చంద్రయాన్-3 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు రూ.615 కోట్ల బడ్జెట్‌ వెచ్చించినట్లు తెలుస్తోంది. 

అయితే ఇప్పటి వరకు విక్రయించిన అత్యంత ఖరీదైన ఒక బెంజ్ కారు భారతీయ చంద్రయాన్-3 బడ్జెట్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ కారు ఏది? దాని ఖరీదెంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే..
నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ 'ఉహ్లెన్‌హాట్ కూపే' (1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe) అని తెలుస్తోంది. ఈ కారుని వేలం పాటలో 143 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1203 కోట్లు.

జర్మనీలో స్టుట్‌గార్ట్‌లోని మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఆర్ఎమ్ సోథెబీస్ నిర్వహించిన ఒక ప్రైవేట్ వేలంలో ఈ కారు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడైంది. ఈ కారు ఎందుకు ఇంత ఖరీదైనదంటే? ఇలాంటి మోడల్స్ ప్రపంచంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి.

ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

నిజానికి ఈ కార్లు లే మాన్స్‌లో రేసింగ్‌కు వెళ్ళడానికి అనుకూలంగా బెంజ్ కంపెనీ తయారు చేయడం జరిగింది. దీని సృష్టించిన సృష్టికర్త పేరునే ఈ కారుకి పెట్టడం ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ కారు గరిష్ట వేగం 180 మైల్స్/గం (గంటకు 289.6 కిమీ) అని తెలుస్తోంది. ఈ కారు చాలా రేసుల్లో ఉపయోగించిన తరువాత కేవలం సెలబ్రిటీలను రవాణా చేయడానికి ఉపయోగించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)