Breaking News

అదంతా ఉత్తదే! ఎలాన్‌ మస్క్‌పై షాకింగ్‌ రిపోర్ట్‌

Published on Tue, 08/22/2023 - 21:39

ఎక్స్‌ (ట్విటర్‌) అధినేత ఎలాన్ మస్క్‌ (Elon Musk)పై షాకింగ్‌ రిపోర్ట్‌ ఒకటి వెలువడింది. చిత్రమైన ఆలోచనలు, నిర్ణయాలు, విచిత్ర వ్యాఖ్యానాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మస్క్‌కు సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇదంతా ఉత్తదే అని ఓ రిపోర్ట్‌ పేర్కొంటోంది.

ఎక్స్‌ (ట్విటర్‌)లో  ఎలాన్ మస్క్‌కు ఏకంగా 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇందులో చాలా వరకు అకౌంట్లు ఫేక్‌ అని, కొన్ని యాక్టివ్ లో లేవని, మరికొన్ని కొత్త అకౌంట్స్ అని థర్డ్ పార్టీ రీసెర్చర్ ‘ట్రావిస్ బ్రౌన్’ సేకరించిన డేటా ఆధారంగా ‘మ్యాషబుల్‌’ (Mashable) అనే టెక్‌ వెబ్‌సైట్‌ నివేదించింది.

 

మస్క్‌కి ఉన్న 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లలో దాదాపు 42 శాతం అంటే 65.3 మిలియన్లకు పైగా ఖాతాలకు కనీసం ఒక్క ఫాలోవర్ కూడా లేరని ఈ నివేదిక పేర్కొంది. మస్క్‌ను అనుసరిస్తున్న ఒక్కో ఖాతాలకు సగటున ఉన్న ఫాలోవర్లు కేవలం 187 మంది. మస్క్‌ ఫాలోవర్లలో 0.3 శాతం అంటే 4,53,000 మంది మాత్రమే ఎక్స్‌ ప్రీమియం (ట్విటర్‌ బ్లూ) సబ్‌స్క్రైబర్లు. మస్క్ ఫాలోవర్లలో 62.5 మిలియన్ల మంది ఎప్పుడూ అసలు ఒక్క ట్వీట్‌ కూడా చేయలేదని రిపోర్ట్‌ వెల్లడించింది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)