Breaking News

చైనాను బీట్‌ చేసి మరీ, దూసుకొచ్చిన భారత్‌

Published on Tue, 07/11/2023 - 12:56

న్యూఢిల్లీ: పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా భారతదేశం చైనాను అధిగమించింది. దాదాపు 21 ట్రిలియన్‌ డాలర్ల అసెట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 85 సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌లు,  57 సెంట్రల్‌ బ్యాంకులు, 142 చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్ల అభిప్రాయాల ప్రాతిపదికన ప్రపంచ పెట్టుబడి నిర్వహణ సంస్థ ఇన్వెస్కో వెల్లడించిన ఒక నివేదిక ఈ విషయాన్ని తెలిపించింది.

‘‘ఇన్వెస్కో గ్లోబల్‌ సావరిన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీ’’  పేరుతో వెలువడిన ఈ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 
♦    భారతదేశలో మెరుగైన వ్యాపార పరిస్థితులు,  రాజకీయ స్థిరత్వం, అనుకూలమైన జనాభా, నియంత్రణ పరమైన సానుకూలతలు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, సంస్థలు, ఫండ్స్‌కు స్నేహపూర్వక వాతావరణం కలి్పస్తున్నాయి.  
♦    ద్రవ్యోల్బణం– వాస్తవ వడ్డీ రేట్ల పరిస్థితుల ప్రాతిపదికన  పెట్టుబడిదారులు తరచూ తమ  పోర్ట్‌ఫోలియోలను రీకాలిబ్రేట్‌ (పునఃసమీక్ష, మదింపు) చేసుకుంటున్నారు.  
♦     ‘‘మాకు భారతదేశం లేదా చైనాతో తగినంత పెట్టుబడులు ఏమీ లేవు.  అయితే, వ్యాపార, రాజకీయ స్థిరత్వం పరంగా భారతదేశం ఇప్పుడు మెరుగైన పరిస్థితిలో ఉన్నట్లు కనబడుతోంది. రెగ్యులేటరీ వ్యవస్థల పటిష్టంగా ఉండడం సావరిన్‌ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న అంశం’’ అని మధ్యప్రాచ్యంలో ఉన్న ఒక సావరిన్‌ ఫండ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.  
♦     దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని పెరిగిన విదేశీ కార్పొరేట్‌ పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతున్న మెక్సికో,  బ్రెజిల్‌తో సహా అనేక దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంటోంది.  
♦ కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య మధ్య నికర వ్యత్యాసం) కట్టడికి, దేశీయ కరెన్సీల పటిష్టతలకు దోహదపడుతున్న అంశం ఇది.  
♦  పెట్టుబడులను పెంచడానికి ఆకర్షణీయమైన వర్ధమాన మార్కెట్‌లలో ప్రస్తుతం భారత్, దక్షిణ కొరియాలు ఉన్నాయి.  
♦     ద్రవ్యోల్బణం సవాళ్లు భారత్‌సహా భౌగోళికంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడి, వర్థమాన దేశాల మార్కెట్‌  బాండ్లు పెట్టుబడులకు తగిన సాధనాలుగా భావించవచ్చు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)