Breaking News

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

Published on Fri, 01/09/2026 - 18:36

కొత్త ఏడాదిలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఇదే నిజమైతే 2026 జూన్ నెలలో టారిఫ్ ప్లాన్స్ 15 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.

రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్‌లను 10 శాతం నుంచి 20 శాతం పెంచవచ్చు. ఎయిర్‌టెల్‌ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తుందని సమాచారం. అయితే వోడాఫోన్ ఐడియా (VI) పరిస్థితి మరింత సవాలుగా మారనుంది. దాని బకాయి చెల్లింపులను తీర్చడానికి, కంపెనీ FY27 & FY30 మధ్య మొబైల్ సర్వీస్ రేట్లను 45 శాతం వరకు పెంచాల్సి రావచ్చు.

ఏ కంపెనీ ఎంత టారిఫ్‌లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్‌టెల్ 28 రోజుల అన్‌లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది. జియో రూ.299 ప్లాన్‌ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.

ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!

జూన్ 2026 నుంచి టారిఫ్‌లు పెరిగితే, సాధారణ వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జ్ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి ఉంది. ప్రీపెయిడ్ వినియోగదారులకు & ఎక్కువ డేటా వినియోగించేవారి ఇది కొంత కష్టతరం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టెలికాం కంపెనీల అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంది.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)