Breaking News

మొబైల్ డేటాపై పన్ను.. కేంద్రం కొత్త ఆలోచన!

Published on Fri, 03/13/2026 - 04:30

దేశంలో పన్ను వసూళ్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా వినియోగంపై పన్ను విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరిలో జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో చర్చ జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా దేశంలో రోజువారీ డేటా వినియోగంపై చిన్న మొత్తంలో పన్ను విధించే ప్రతిపాదనను పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారీగా పెరిగిన డేటా వినియోగం 
భారతదేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవల కారణంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం ద్వారా కొత్త ఆదాయ వనరులు సృష్టించాలనే ఉద్దేశంతో టెలీకాం శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనపై అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ నాటికి దీనిపై సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

జీబీకి రూ.1 పన్ను వేధించినా..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులు మొత్తంగా  సుమారు 229 బిలియన్ జీబీల డేటాను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఒక్కో జీబీకి కేవలం రూ.1 పన్ను విధించినా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.22,900 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వినియోగదారులపై ప్రభావం
ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ ఇప్పటికే అమల్లో ఉంది. ఇదిలా ఉండగా టెలికాం కంపెనీలు గత కొంతకాలంగా ప్లాన్ ధరలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో డేటా పన్ను అమల్లోకి వస్తే వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు, జీబీకి రూ.1 పన్ను విధిస్తే రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించే వినియోగదారుడు నెలకు సుమారు రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చ దశలో మాత్రమే ఉందని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)